దైవ దర్శనానికి వెళుతుండగా..

11 May, 2019 13:21 IST|Sakshi
సంఘటన స్థలం వద్ద రోదిస్తున్న చిన్నారులు

మార్గం మధ్యలో లారీని ఢీకొన్న ఆటో

మహిళ మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు

గొల్లప్రోలు: వన్నెపూడి పుంతరోడ్డు శివారు 16వ నంబరు జాతీయరహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రౌతులపూడికి చెందిన కోరుప్రోలు కుమారి(42) మృతి చెందగా మరో ముగ్గరికి తీవ్రగాయాలయ్యాయి. గొల్లప్రోలు పోలీసుల కథనం ప్రకారం.. రౌతులపూడి నుంచి పశ్చిమగోదావరి జిల్లా గౌరీపట్నం మేరీమాత గుడికి వెళ్తున్న ఆటో రోడ్డు పక్కనున్న ట్రాలీ లారీను శుక్రవారం తెల్లవారుజామున బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న కుమారి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన ఎలుగొండ ప్రసన్న, రత్నం, బేబీలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎలుగొండ ఏసు, యశ్వంత్, లాజరు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

ఆటో డ్రైవర్‌ అజాగ్రత్త, వేగంగా నడప డం వల్లే ప్రమా దం జరిగినట్టు స్థా నికులు తెలిపారు. ట్రాలీపై ఉన్న ఇనుప రేకులు తగులుకోవడంతో ఆటో రోడ్డుపై బోల్తాపడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు. రక్తంతో రహదారి మొత్తం తడిసిపోయింది. దైవదర్శనానికి వెళుతున్న సమయంలో ప్రమా దం చోటు చేసుకోవడంతో విషాదచాయలు అలుముకున్నాయి. చిన్నారులు తమ కుటుంబసభ్యులను చూసి రోదించిన తీరు పలు వురిని కలచివేసింది. గొల్లప్రోలు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది, పోలీసులు క్షతగాత్రులను మొదట ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఆటో మొత్తం నుజ్జునుజ్జయ్యింది. గొల్లప్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆప్‌ ఎమ్మెల్యేకు జైలు శిక్ష విధించిన కోర్టు

ఫ్లాట్‌ నుంచి దుర్వాసన; తల్లీకొడుకుల మృతదేహాలు..

పాత వీడియోనే.. మళ్లీ వైరల్‌!

ఘోర బస్సు ప్రమాదం; ఆరుగురు మృతి

ఇది ఆ గ్యాంగ్‌ పనే!

బాలికపై స్కూల్‌ అటెండర్‌ వేధింపులు

యువతిపై అత్యాచారం..

విద్యార్థినిలకు బ్లాక్‌మెయిల్‌..స్పందించిన సీఎం

కృష్ణదేవరాయ యూనివర్శిటీలో కి‘లేడీ’

పేరు తేడా.. పెళ్లి ఆపేసింది!

చీరల దొంగలు చీరాలకు వెళుతూ..

గృహిణి అదృశ్యం

అదుపు తప్పిన బాలుడు.. నగరంలో దందాలు

నగరాన్ని నంజుకుంటున్న నల్లజాతీయులు

ఏకాంతంగా దొరికారు.. గుండుకొట్టించారు!

అమెరికాలో పాతబస్తీ యువకుడి మృతి

రూ. 4వేలకు ఆరు నెలల చిన్నారి కొనుగోలు

అజ్ఞాతంలో ఉన్నా పసిగట్టారు

ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

మహిళపై దుబాయ్‌ ఏజెంట్‌ లైంగిక దాడి

రాంగ్‌ రూట్‌లో రావొద్దన్నందుకు దాడి

‘అమ్మానాన్న' నేను వెళ్లిపోతున్నా..

గిరిజన బాలికపై అత్యాచారం

బావిలో చిన్నారి మృతదేహం

పక్కపక్కనే సమాధులు ఉంచాలంటూ..

నకిలీ బంగారంతో బ్యాంకుకే బురిడీ

సినీ కాస్ట్యూమర్‌ ఆత్మహత్య

‘జార్ఖండ్‌ మూక దాడి’ వ్యక్తి మృతి

నైజీరియన్‌ డ్రగ్స్‌ ముఠా అరెస్టు

దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తాని చెప్పి లాడ్జిలో..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆయనను తాత అనకండి ప్లీజ్‌!!

‘శ్వాస’ ఆగిపోయిందా?

SAKSHI

బిగ్‌బాస్‌-3లో నేను లేను.. క్లారిటీ ఇచ్చిన నటి

27వ పడిలో షారుఖ్‌ ఖాన్‌

‘జెర్సీ’ రీమేక్‌లో ‘కబీర్‌ సింగ్‌’

కల్కి : ఆలస్యమైనా.. ఆసక్తికరంగా!