ఆత్మహత్యకు యత్నించిన మహిళా రైతు మృతి 

27 Mar, 2018 13:12 IST|Sakshi
వెంకటవ్వ మృతదేహం

కారకుల్ని శిక్షించాలని సీపీఐ డిమాండ్‌ 

హుస్నాబాద్‌: భూ వివాదం పరిష్కారం కావడం లేదని మనస్థాపం చెంది ఈ నెల 17న ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసుకున్న మహిళా రైతు వెంకటవ్వ ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. వెంకటమ్మ మృతికి కారణమైన రెవెన్యూ అధికారులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలో సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

అనంతరం సీఎం దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు గడిపె మల్లేష్‌ మాట్లాడుతూ..కోహెడ మండలం కూరెళ్ల మాజీ సర్పంచ్‌ కేతిరెడ్డి బాల్‌రెడ్డి, వెంకటవ్వ దంపతులు భూ వివాదం పరిష్కరం కావడం లేదని మనస్తాపంతో ఆత్మాహత్నానికి పాల్పడడం, చికిత్స పొందుతూ వెంకటవ్వ మరణించడం బాధాకరమన్నారు.

అధికారుల నిర్లక్ష్యానికి ఈ ఘటన నిదర్శనమన్నారు. ఈ ఘటనపై సింగిల్‌ జడ్జిచే విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మృతి చెందిన వెంకటమ్మ కుటుంబానికి నాలుగు ఎకరాల భూమి, రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు హన్మిరెడ్డి, వనేష్, యాద పద్మ, రాజ్‌కుమార్, నరేశ్, బాషవేని బాలయ్య, సంజీవరెడ్డి, అయిలేని మల్లారెడ్డి,   సమ్మయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు