చెన్నైలో మహిళా పారిశ్రామికవేత్త బలవన్మరణం

13 Sep, 2019 07:36 IST|Sakshi
రీటాలింగ (ఫైల్‌)

లాన్స్‌ టయోటా కో– డైరెక్టర్‌ రీటాగా గుర్తింపు

దర్యాప్తు వేగవంతం

సాక్షి, చెన్నై : మహిళా పారిశ్రామికవేత్త చెన్నైలో గురువారం బలన్మరణానికి పాల్పడ్డారు. లాన్స్‌ టయోటా డీలర్‌ కో– డైరెక్టర్‌గా రీటా లింగగా ఆమెను గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలపై నుంగంబాక్కం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. వివరాలు..

తమిళనాడులోని లాన్స్‌ టయోటా కార్ల షోరూమ్‌ల ఏర్పాటులో చెన్నై నుంగంబాక్కంకు చెందిన లంక లింగం కుటుంబం ›ప్రధాన డీలర్‌గా వ్యవహరిస్తోంది. దీనికి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా లింగం వ్యవహరిస్తున్నారు. ఆయన భార్య రీటా కో– డైరెక్టర్‌గా ఉన్నారు. నుంగంబాక్కంలో అతి పెద్ద భవనంగా వీరి నివాసం ఉంది. రోజూ ఉదయం ఎనిమిది గంటలకు నిద్రలేచి రీటా కార్యాలయానికి వెళ్లేవారు. గురువారం 11 గంటలైనా ఆమె గది తలుపులు తెరచుకోలేదు. ఆందోళన చెందిన ఇంటి పనిమనిషి ఏసుపాదం నుంగంబాక్కం పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె గది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతుండడాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించారు. రెండు, మూడు రోజులుగా ఆమె తీవ్ర మనో వేదనతో ఉన్నట్టుగా విచారణలో తేలింది. అలాగే ప్రస్తుతం కార్ల వ్యాపారం మందగించడంతో నష్టాలు వచ్చాయా, అప్పులు ఉన్నాయా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తంచేసే వాళ్లు సైతం ఉండడంతో ఆదిశగా పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.

మరిన్ని వార్తలు