హత్యా.. ఆత్మహత్యా?

4 Nov, 2018 10:32 IST|Sakshi
మంగి మృతదేహం

పెద్దఅడిశర్లపల్లి(దేవరకొండ) : అనుమానాస్పదస్థితిలో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన శనివారం  పీఏపల్లి మండలం గడ్డమీదితండాలో జరిగింది. మృతురాలి బంధువుల తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వద్దిపట్ల గ్రామపంచాయతీ పరిధిలోని గడ్డమీదితండాకు చెందిన మూనావత్‌ శ్రీనుకు, తిరుమలగిరి సాగర్‌ మండలం కీచ్యా తండాకు చెందిన మూనావత్‌ మంగికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. దంపతులిద్దరూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పన్నెండేళ్లలోపు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

అయితే శ్రీను తరచూ మద్యం సేవిస్తూ మంగితో గొడవపడేవాడు. ఈ క్రమంలోనే దంపతుల మధ్య ఘర్షణ కూడా తలెత్తేది. శనివారం పిల్లలను పాఠశాలకు పంపిన తర్వాత మంగి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లింది. పొలం వద్ద సాయంత్రం అనుమానాస్పదస్థితిలో మృతి చెం దింది. పొలం వద్దకు వెళ్లిన మంగిని భర్త, అత్తామామలు కలిసి గొంతు నులిమి చంపారని మృ తురాలి బంధువుల ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతి కేసు గా నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు గుడిపల్లి ఎస్‌ఐ వీరరాఘవులు తెలిపారు.
  
ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన డీఎస్పీ
గడ్డమీదితండాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మంగి మృతదేహాన్ని దేవరకొండ డీఎస్పీ మహేశ్వర్‌ పరిశీలించారు. మృతి కారణాలను అడి గి తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షంచాలని మృతురాలి బంధువులు కోరారు. డీఎస్పీ వెంట కొండమల్లేపల్లి సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌ఐ వీరరాఘవరెడ్డి, శ్రీని వాస్‌నాయక్, ఏఎస్‌ఐ యల్లయ్య, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు