నోట్లో గుడ్డలు కుక్కి, కర్రతో వాతలు పెట్టి...

1 Jun, 2018 07:25 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు, (ఇన్‌సెట్లో) వాతలతో గాయాలైన దృశ్యం

వివాహిత దారుణ హత్య

కోడలను అంతమొందించిన అత్తామామ 

మృతురాలి బంధువుల ఆందోళన

నిజాంసాగర్‌(జుక్కల్‌) : వివాహేతర సంబంధంతో కుటుంబ పరువు తీస్తుందని భావించి కోడలిని హత్య చేసిన సంఘటన నిజాంసాగర్‌ మండలం ఆరేడ్‌ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలి లా ఉన్నాయి. గ్రామానికి చెందిన కుర్మ సుమలత (21) అలియాస్‌(రేణుక) అనే వివాహితను గొంతు నులిమి, నుదిటిపై బాది, నోట్లో గుడ్డలు కుక్కి, కర్రతో వాతలు పెట్టి హత్య చేశారు. గ్రామానికి చెందిన కుర్మ మల్లయ్య, సాయవ్వకు ఇద్దరు కు మారులు. పెద్ద కుమారుడు కుర్మబాబుకు మతిస్థిమితం లేదు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డిపేట గ్రా మానికి చెందిన రేణుకతో బాబుకు మూడున్నరేళ్ల కింద పెళ్లి చేశారు. వీరికి ఏడాదిన్నర కుమారుడు గణేశ్‌ ఉన్నాడు. వారం కింద గణేశ్‌ పుట్టు వెంట్రు కల పండుగను ఘనంగా నిర్వహించారు.

రేణుక గ్రామానికి చెందిన ఒకరితో వివాహేతర సంబం ధం కొనసాగిస్తుంది. ఈ విషయమై అత్తామామ తో రేణుక తరుచూ గొడవ పడేది. దీనిని మనస్సు లో పెట్టుకున్న అత్తామామలు పథకం ప్రకారం రేణుకను హత్య చేశారు. ఇంటి ఆవరణలో నిద్రించిన రేణుకను అర్ధరాత్రి వేళ అత్తామామ గొంతు నులిమి, నోట్లో గుడ్డలు కుక్కి, నుదిపై బాదారు. అంతటితో ఆగకుండా చేతులు, వీపు భాగంలో కర్రతో వాతలు పెట్టారు. అప్పటే రేణుక మృతిచెందడటంతో బాత్‌రూం వద్ద మృతదేహాన్ని పడుకోబెట్టారు. కరెంట్‌ షాక్‌తో మృతి చెందినట్లు నటించారు. తెల్లవారు జామున గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో అసలు విషయం బయటపడింది.

గ్రామస్తుల సమాచారం మేరకు నిజాం సాగర్, పిట్లం మండలాల ఎస్‌ఐలు ఉపేందర్‌రెడ్డి, అంతిరెడ్డితో పాటు బాన్సువాడ రూరల్‌ సీఐ శ్రీనివాస్, డీఎస్పీ నర్సింహారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు మృతదేహానికి పంచనామా చేసి, పోస్టుమార్టం కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు అత్త సాయవ్వ, మామ మల్లయ్యపై హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఉపందేర్‌రెడ్డి తెలిపారు.

 అత్తామామలపై చర్యలు తీసుకోవాలి

కోడలిని హత్య చేసిన అత్తామామలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతురాలి బంధువులు సంఘటన స్థలం వద్ద ఆందోళనకు దిగారు. మృతురాలి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని బాధితురాలి బంధువులు పోలీసులను కోరారు. దీంతో గ్రామస్తులు, నిందితుల బంధువులు కలిసి పంచాయితీ నిర్వహించారు. మృతురాలి తల్లిదండ్రులకు కొంత నగదు ఇవ్వనున్నట్లు గ్రామ పెద్దలు ఒప్పుకున్నారు. 

మరిన్ని వార్తలు