మరిదితో వివాహేతర సంబంధం.. దారుణ హత్య

23 May, 2019 08:30 IST|Sakshi
లక్ష్మి (ఫైల్‌)

కర్నూలు, బేతంచెర్ల: మరిది చేతిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన మండల పరిధిలోని అంబాపురంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు.. అంబాపురం గ్రామానికి చెందిన గుండుపాపల మద్దయ్య కుమారుడు మహేంద్రకు, ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామానికి చెందిన బోయ బాలస్వామి కుమార్తె లక్ష్మి(22)ని ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి హేమనాథ్‌ (4), చంద్రిక (2) సంతానం. కొంతకాలంగా లక్ష్మి వరుసకు మరిది అయిన లారీ క్లీనర్‌ మనోజ్‌(భర్త చిన్నాన్న కుమారుడు)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఇటీవల మరికొంతమందితోనూ చనువుగా ఉండటంతో మనోజ్‌ కోపోద్రిక్తుడయ్యాడు.  మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తన ఇంటికి పిలిపించుకొని.. పిచ్చపాటిగా మాట్లాడి రాత్రి లక్ష్మి మెడకు చీరతో ఉరి వేసి, ఇంటికి తాళం వేసి పారిపోయాడు. లక్ష్మి ఇంటికి రాకపోవడంతో భర్త గ్రామంలో గాలించి చివరకు వరుసకు తమ్ముడు అయిన మనోజ్‌ ఇంటి వద్దకు వెళ్లి తాళాలు పగుల గొట్టి చూడగా.. ఉరికి వేలాడుతూ కనిపించింది. పక్క గదిలో మద్యం బాటిళ్లు, వాటర్‌ ప్యాకెట్లు కనిపించాయి. గ్రామస్తుల సమాచారంతో సీఐ ఓబులేసు, ఎస్‌ఐ మస్తాన్‌వలి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లెకు తరలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లిస్బన్‌ క్లబ్‌ ఘటన.. డీజీపీ ఆరా

తోటల్లో వ్యభిచారం.. అధికులు కాలేజీ స్టూడెంట్సే

గర్భిణి అని కూడా చూడకుండా..

నవదంపతుల ఆత్మహత్య

ఒక్క ఫోన్‌ కాల్‌ విలువ రూ.40,000!

పోలీసుల ముందే బీరు తాగుతూ హల్‌చల్‌..

గంజాయి చాక్లెట్‌ 

తెల్లారిన బతుకులు

బెంబేలెత్తిన బీహార్‌.. ఒక్కరోజులో 40 మంది మృతి

ప్రియుడి మోజులో పడి.. దారుణానికి  ఒడిగట్టి..

నకిలీ ఎస్సై హల్‌చల్‌

ఓ విదేశీ జంట.. కరెన్సీ కావాలంటూ!

సిండి‘కేటు’కు సంకెళ్లు 

బీజేపీ అధ్యక్షురాలి సెల్‌ఫోన్‌ చోరీ

నకిలీ విత్తనంపై నిఘా

ఈజీ మైండ్‌ ఇట్టే ముంచేసింది..

పేరుకే పోలీస్‌..వృత్తి మాత్రం దొంగతనం

అయ్యో.. హారికా..!

చెల్లెల్ని ప్రేమించాడు.. వావివరసలు మరిచి..

అదే బావిలో అప్పుడు కొడుకు .. ఇపుడు తండ్రి..

రౌడీ షీటర్‌ దారుణహత్య

కోడెల బండారం బట్టబయలు

బట్టలూడదీసి పబ్‌ డ్యాన్సర్‌ను కొట్టారు..!

పెళ్ళైన మూడు నెలలకే  దంపతుల ఆత్మహత్య

స్విమ్మింగ్‌ పూల్‌లో పడి బాలుడి మృతి

మహిళా పోలీసు దారుణ హత్య

ఫేక్‌ వీడియో; చిక్కుల్లో ఎమ్మెల్యే!

భార్యపై పైశాచికత్వం; హత్య!

రుయా ఆస్పత్రిలో దారుణం

నిందితుడు తక్కువ కులంవాడు కావడంతో..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జీవీ చిత్రం

రజనీ కన్నా కమల్‌ బెటర్‌!

హ్యాండిచ్చిన రష్మిక!

పాటల పల్లకీకి కొత్త బోయీలు

ఆ కోరికైతే ఉంది!

త్వరలోనే బిగ్‌బాస్‌-3 షురూ