అన్నానగర్‌లో మహిళ హత్య

6 Aug, 2019 08:15 IST|Sakshi
పింకీ (ఫైల్‌)

తమిళనాడు,టీ.నగర్‌: చెన్నై అన్నానగర్‌లో యువకుడితో నివశిస్తూ వచ్చిన ఉత్తరదేశ మహిళ ఆదివారం హత్యకు గురయ్యారు. దీనికి సంబంధించి యువకుడు సహా ముగ్గురి వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన యువతి పింకీ (30). ఈమె భర్త ఉత్తమ్‌ మండల్‌. కుటుంబ సమస్య కారణంగా వీరు విడిపోయి జీవిస్తున్నారు. ఇలావుండగా చెన్నై అన్నానగర్‌లో ఉంటున్న పింకీ చీరలు విక్రయిస్తూ వచ్చింది. ఈమెతోపాటు కష్ణన్‌ బహుదూర్‌ (26) నివశిస్తూ వచ్చారు. ఆదివారం ఉదయం బయటికి వెళ్లిన కష్ణన్‌ బహుదూర్‌ రాత్రి ఇంటికి రాగా బాత్‌రూం గదిలో పింకీ హత్యకు గురైవుండడం గమనించి దిగ్భ్రాంతి చెందాడు. దీనిగురించి సమాచారం అందుకున్న తిరుమంగళం ఇన్‌స్పెక్టర్‌ రవి, ఎస్‌ఐ యువరాజ్‌ సంఘటనా స్థలం చేరుకుని విచారణ జరిపారు. ఆమె మతదేహాన్ని పోస్టుమార్టం కోసం కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఆధారంగా విచారణ జరుపుతున్నారు. కెమెరా పుటేజీలో ఇద్దరు వ్యక్తులు వచ్చి వెళుతుండడంతో నగల కోసం ఆమెను హతమార్చి ఉండొచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా స్నేహితులతో కలిసి పింకీని హత్య చేసి కష్ణన్‌ బహుదూర్‌ నాటకమాడుతున్నాడా? అనే కోణంలోను విచారిస్తున్నారు. కష్ణన్‌ బహుదూరు ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.

>
మరిన్ని వార్తలు