మహిళా ఇన్‌స్పెక్టర్‌ ఆత్మహత్యాయత్నం

22 May, 2018 08:25 IST|Sakshi
సుగుణ(ఫైల్‌)

టీ.నగర్‌: నాగపట్నం ఎస్పీ కార్యాలయంలో మహిళా ఇన్‌స్పెక్టర్‌ శనివారం రాత్రి ఆత్మహత్యాకు యత్నించింది. నాగపట్నం మైలాడుదురై ప్రొహిబిషన్‌ ఇన్‌స్పెక్టర్‌గా సుగుణ (36) పనిచేస్తూ వచ్చారు. ఆమెకు ఉన్నతాధికారుల వేధింపులు ఎక్కువ కావడంతో ఈమెను ఎస్పీ దేశ్‌ముఖ్‌ శేఖర్‌ సంజయ్‌ సాయుధ దళానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. దీంతో అక్కడికి వెళ్లి విధుల్లో చేరింది. అక్కడ కూడా అధికారులు టార్చర్‌ చేసినట్లు సమాచారం.

దీంతో విరక్తి చెందిన సుగుణ శనివారం రాత్రి ఎస్పీ కార్యాలయం పోర్టికోలో నిలుచుని అధిక మొత్తంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నిం చింది. అక్కడున్న పోలీసులకు తాను నిద్రమాత్రలు మింగినట్లు తెలపడంతో వారు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఈ వ్యవహారంపై శాఖాపరమైన విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ఇన్‌స్పెక్టర్‌ సుగుణ భర్త పోలీసు శాఖలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. పోలీసు శాఖలో పనిభారం, అధికారుల వేధింపులు అధికం కావడంతో ఈ సంఘటన పోలీసు వర్గాల్లో కలకలం రేపింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు