పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం

20 Jul, 2018 13:45 IST|Sakshi
పిల్లలను 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తున్న సిబ్బంది 

భువనగిరి క్రైం : కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన తల్లి పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తనతో పాటు ముగ్గురి పిల్లలకు పురుగుల మందు తాగించింది. స్పందించిన స్థాని కులు వెంటనే 108కి ఫోన్‌ చేసి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన భువనగిరి మండలం రెడ్డినాయక్‌ తండాలో గురువా రం జరిగింది. భువనగిరిరూరల్‌ పోలీసులు, స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డినాయక్‌ తండాకు చెందిన భూక్య రెడ్డినాయక్‌ లారీడ్రైవర్‌గా పనిచేస్తుంటాడు.

అతని భార్య  భారతి ఇంటివద్ద ఉంటుంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పల్లవి, ఉదయ్, వైష్ణవిలు. వీరు స్థానిక ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో చదువుకుంటున్నారు. గతంలో దంపతులిద్దరూ గొడవ పడగా భారతి తన పుట్టినిల్లు అయిన మేడ్చల్‌ జిల్లా రాజుబొల్లారంతండాకు వెళ్లిపోయింది. ఇటీవల రెడ్డినాయక్‌ రాజుబొల్లా రం వెళ్లి తన భార్యను తిరిగి రెడ్డినాయక్‌ తండాకు తీసుకొచ్చాడు. బుధవారం రాత్రి మళ్లీ భార్యాభర్తకు గొడవ జరిగింది.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భారతి గురువారం పిల్లలను పాఠశాలకు కూడా పంపించలేదు. మధ్యాహ్నం సమయంలో పిల్లలను తీసుకుని వ్యవసాయబావి వద్దకు వెళ్లి ముగ్గురు పిల్లలకు క్రిమిసంహారక మందు తాగించి తాను కూడా తాగింది. వెంటనే  తన తండ్రికి ఫోన్‌ చేసి క్రిమిసంహారక మందు తాగినట్టు చె ప్పింది. భారతి తండ్రి వెంటనే రెడ్డినాయక్‌ తండాలోని భారతి ఇంటి పక్క వాళ్లకు సమాచారం అం దించాడు.

సమాచారం తెలుసుకున్న ఇంటి పక్క వాళ్లు వెంటనే వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వా రిని చూసి 108కి సమాచారం అందించారు. 108 వచ్చే లోపే ద్విచక్ర వాహనాలపై వారు నలుగురిని తీసుకుని అనాజీపురం గ్రామం వద్ద 108కి ఎదురుగా వెళ్లి ఎక్కించారు. వెంటనే వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. మెరుగైన చికిత్సకు వారిని ఉప్పల్‌లోని ఓప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. భారతి ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఏఏస్‌ఐ సాగర్‌రావు తెలిపారు.

మరిన్ని వార్తలు