బిడ్డను బావిలో తోసి.. తల్లి ఆత్మహత్య

19 May, 2019 10:36 IST|Sakshi
తల్లీబిడ్డల మృతదేహాలు 

నెక్కొండ: భార్యాభర్తల మధ్య ఆర్థిక పరమైన గొడవలు తల్లీకూతుర్ల మృతికి దారితీసిన సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండలో శనివారం చోటుచేసుకుంది. నెక్కొండ మండలం సూరిపల్లికి చెందిన మంగ రమేష్‌కు పర్వతగిరి మండలం గోపనపల్లికి చెందిన బెల్లం మంజుల(27)తో ఐదేళ్ల క్రింత వివాహం జరిగింది. వీరికి కూతురు నిషిత(3) జన్మించిది. రమేష్‌ నెక్కొండలో ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ ఆర్థిక పరమైన గొడవులు జరుగుతున్నాయి. ఏడాది క్రితం మంజుల అస్వస్థతకు గురికావడంతో ప్రైవేట్‌ ఆస్పత్రిలో నడుముకు శస్త్ర చికిత్స చేయించాడు. వైద్య ఖర్చులతో ఆర్థిక భారం పెరగడంతో కాపురంలో కలహాలు పెరిగి పంచాయితీ పెద్దమనుషుల వరకు పోయింది.

వారు చెప్పిన విధంగా నడుచుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో శనివారం ఉదయం మళ్లీ గొడవ జరగడంతో తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ మంజుల తన తమ్ముడు బెల్లం రాజుకు చెప్పి కూతురు నిషితను తీసుకుని నెక్కొండకు చేరుకుంది. సమీప ఊర చెరువు వద్దకు వెళ్లగా అక్కడ కొందరు వ్యక్తులు ఉండడంతో అక్కడి నుంచి ఓ వ్యవసాయ బావి వద్దకు చేరింది. ముందుగా కూతురు బావిలోకి తోసి తనూ దూకింది. పరిసరాల్లో చూసిన పలువురు తల్లీ కూతుళ్లు కనిపించకపోవడంతో బావి వద్దకు వెళ్లి పరిశీలించగా శవాలై కనిపించారు. దీంతో పోలీ సులకు సమాచారం ఇవ్వడంతో నెక్కొండ సీఐ పెద్దన్నకుమార్‌ సిబ్బందితో అక్కడికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. మృతురాలి తండ్రి బెల్లం ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఐదేళ్ల జైలు శిక్ష

ఘోర రోడ్డు ప‍్రమాదం, 25మంది దుర్మరణం

తలలేని మహిళ మృతదేహం.. తీవ్ర కలకలం

హైదరాబాద్‌లో పైశాచిక ఘటన

భగ్గుమన్న అలర్లు.. కాల్పుల్లో ఇద్దరు మృతి

బెంగాల్‌లో చెలరేగిన హింస.. ఇద్దరి మృతి

‘ఆమె పబ్‌ డ్యాన్సర్‌ కాదు’

సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు : గాయని బుక్‌

తండ్రిని హతమార్చిన తనయుడు!

ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో మైనర్‌ బాలికపై అత్యాచారం

ప్రాణత్యాగమా.. బలిచ్చారా

తిరుమల వెళ్తూ తిరిగిరాని లోకాలకు..

ఏసీబీ వలలో ‘ఎక్సైజ్‌’ చేపలు!

మల్టీప్లెక్స్‌ థియేటర్‌ సీజ్‌

దాసరి ప్రభును తీసుకెళ్లిన మహిళ ఎవరు?

భర్త వేధింపులు తాళలేక..

వేశ్యలపై 9 మంది సామూహిక అత్యాచారం

రోడ్డు ప్రమాదంలో సీపీఐ నేత దుర్మరణం

‘జాతీయత లేని’ షేర్‌ అలీ కేష్వానీ..

ఆమె ఆ‍త్మహత్యకు అత్తింటివారే కారణం

‘తీగ’ లాగితే...

చింతమనేనిపై కేసు నమోదు

గమ్యం చేరకుండానే..

ఏసీబీ వలలో పంచాయతీ కమిషనర్‌

కసాయి తండ్రి

చంపేశారయ్యా... 

సంసారానికి పనికిరాకున్నా.. ఘరానా మొగుడు

ఎద్దుల బండిని ఢీకొన్న లారీ

ప్రేమించడం పాపమా.. శాపమా?

సోదరుడు కాదు..ఉన్మాది  

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

న్యూ లుక్‌.. న్యూ క్యారెక్టర్‌

బెదిరింపులతో ఓటర్‌ని ఆపలేరు

అందుకే డిటెక్టివ్‌ కథకి ఓకే చెప్పా

ఎమోషనల్‌ జర్నీ స్టార్ట్‌

హలో హాలీవుడ్‌

విద్య కోసం పోరాటం