కూతురు నిలదీసిందని.. తల్లి ఆత్మహత్య

5 Nov, 2018 06:43 IST|Sakshi
కవిత మృతదేహం

జూలూరుపాడు ఖమ్మం: ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. హెడ్‌ కానిస్టేబుల్‌ శివాజీ గణేష్‌ తెలిపిన వివరాలు... గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో దినసరి కూలీగా పనిచేస్తున్న సూర్నపాక కమల(38), పడమటనర్సాపురంలో నివాసముంటోంది. ఆమెకు ఇరయ్యేళ్ల క్రితం పెళ్లయింది. కుమారడు, కూతురు ఉన్నారు. భర్తతో గొడవపడి కొంతకాలంగా పడమటనర్సాపురంలో కూతురు కావ్యతో వేరుగా ఉంటోంది. గత నెల 31న ఆమె కూతురు కావ్య, తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. ఈ నెల 3న (శనివారం) తిరిగొచ్చేసరికి ఇంటిలో కమలతో మరో వ్యక్తి ఉన్నాడు. తల్లిని కూతురు నిలదీసింది. దీనిని తట్టుకోలేని కమల, ఆదివారం తెల్లవారు జామున గడ్డి మందు తాగింది. కొత్తగూడెం ప్రభుత్వ మెయిన్‌ ఆసుపత్రిలో మృతిచెందింది. ఆమె సోదరి జబ్బా వెంకటలక్ష్మి ఫిర్యాదుతో కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పాల్వచంలో వివాహిత... 
పాల్వంచ: కుటుంబ కలహాలు, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని గట్టాయిగూడెంలో ఇది జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గట్టాయిగూడెంలోని అద్దె ఇంటిలో కేటీపీఎస్‌ ఉద్యోగి దేవబక్తిని శ్రీకాంత్‌ కుటుంబం నివసిస్తోంది. కుటుంబ కలహాలు, ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో ఆయన భార్య కవిత(35), ఆదివారం చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని ఎస్‌ఐలు ఎం.రమేష్, రవి సందర్శించారు.

మరిన్ని వార్తలు