భర్తపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టిన భార్య

12 Dec, 2019 09:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తిరువొత్తియూరు: కాలి గొలుసులను తాకట్టు పెట్టి మద్యం తాగడంతో ఆగ్రహం చెందిన భార్య భర్తపై పెట్రోల్‌ పోసి నిప్పు అంటించింది. తీవ్ర గాయాలైన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విల్లుపురం జిల్లా కండమంగళం మారియమ్మన్‌ ఆలయ వీధికి చెందిన సెంథిల్‌ (36) తాపీమేస్త్రీ. అతని భార్య చిత్ర (32). వీరికి వెట్రివేల్‌ (12), హరీష్‌ (10), అనే ఇద్దరు కుమారులు వున్నారు. సెంథిల్‌కు మద్యం అలవాటు ఉంది. పనికి వెళ్లకుండా మద్యం తాగి వచ్చి ఇంటిలో గొడవ చేసేవాడని తెలిసింది. మంగళారం చిత్ర కూలికి వెళ్లడంతో ఇంటిలో ఒంటరిగా వున్న సెంథిల్‌ మద్యం తాగడానికి డబ్బులు లేకపోవడంతో భార్య కాలి గొలుసులను రూ.1500లకు తాకట్టు పెట్టి ఆ నగదుతో మద్యం తాగి ఇంటికి వచ్చాడు.

పని ముగించుకుని ఇంటికి వచ్చిన చిత్ర తన కాలి గొలుసులు కనపడకపోవడంతో భర్తను నిలదీసింది. అతను తాకట్టు పెట్టి మద్యం తాగినట్టు తెలియడంతో ఆగ్రహం చెంది అతనితో వాగ్వాదానికి దిగింది.  తరువాత అందరూ నిద్రపోయారు. ఆగ్రహం చల్లారని చిత్ర ఇంటి ముందు నిలబెట్టి వున్న సెంథిల్‌ బైకు నుంచి పెట్రోలు ఓ బాటిల్‌లో పట్టుకుని నిద్రపోతున్న సెంథిల్‌పై పోసి నిప్పు అంటించింది. మంటలు అంటుకోవడంతో సెంథిల్‌ కేకలు పెట్టాడు. తీవ్రంగా గాయపడ్డ సెంథిల్‌ను పుదుచ్చేరి కారిమేడు జిప్మర్‌ ఆస్పత్రికి తరలించారు.   సమాచారం అందుకున్న కండామంగళం పోలీసులు కేసు నమోదు చేసి చిత్ర వద్ద విచారణ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా