మేస్త్రీ దాడిలో కార్మికురాలి మృతి

1 Jun, 2019 10:53 IST|Sakshi
రోజా మృతదేహం

అచ్యుతాపురం (యలమంచిలి): జంగులూరులో అపార్ట్‌మెంట్‌ నిర్మాణ పనులు చేస్తున్న పూజారి రోజా (20) కేజీహెచ్‌లో వైద్యం పొందుతూ శుక్రవారం మృతి చెందినట్టు ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు. ఆయన అందించిన వివరాలిలా ఉన్నాయి. అరకుకి చెందిన రోజా రెండేళ్లక్రితం కూలిపని కోసం ఇక్కడికి వచ్చింది. నిర్మాణ పనులు చేస్తూనే అక్కడ మేస్త్రీగా పని చేస్తున్న శ్రీకాకుళం జిల్లా గారమండలం శ్రీకూర్మం మండలానికి చెందిన సురేష్‌తో పరిచయం పెంచుకుంది. మే 29న ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవటంతో ఘర్షణ పడ్డారు.

ఆమె  మొదటి అంతస్తునుంచి కిందపడడంతో తీవ్రంగా గాయపడింది. గాయపడ్డ రోజాను హుటాహుటిన కేజీహెచ్‌కి తరలించారు. ఆమె వైద్యం పొందుతూ శుక్రవారం మృతి చెందింది. తండ్రి లచ్చన్న ఇచ్చిన íఫిర్యాదు మేరకు సురేష్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. ఆమెను అత్యాచారయత్నం చేయడంలో ఇరువురి మధ్యతోపులాట  జరిగిందని మేడపై నుంచి తోసేయడంతో గాయపడి చనిపోయినట్టు  కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. సీఐ విజయనాథ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. గిరిజన మహిళ కావడంతో అట్రాసిటీ కేసు నమోదు చేశామని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తారని ఆయన చెప్పారు. రోజా మృతదేహాన్ని  పోస్టుమార్టం అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు.

మరిన్ని వార్తలు