కలప అక్రమ వ్యాపారం గుట్టురట్టు

16 Apr, 2018 10:29 IST|Sakshi
జేసీబీతో కలపను లారీలో నింపుతున్న దృశ్యం

లారీలో అక్రమంగా తరలిస్తున్నకలప

పట్టించిన విలేకరులు

ధారూరు: అనుమతులు లేకుండా రైతుల పొలా ల్లోని చెట్లను నరికి అక్రమంగా కలప తరలిస్తు న్న లారీలను విలేకరుల సమాచారంతో ఫారెస్టు ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్న సంఘటన ఆదివారం ధారూరు మండల పరిధి మ న్నూరుసోమారం గ్రామ శివారులో చోటు చేసు కుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన కొందరు కలప వ్యాపారులు గత వారం రోజులుగా మున్నూరుసోమారం గ్రా మంలోని చెట్లను నరికి అక్రమంగా లారీల్లో కల ప తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న గ్రా మస్తులు నేరుగా తామే ఫారెస్టు అధికారులకు సమాచారం అందిస్తే ఫలితం ఉండదని భావి ంచి విలేకరులకు ఫోన్‌ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న విలేకరులు అక్రమ కలప వ్యాపా రం గుట్టురట్టు చేశారు.

ధారూరు మండలంలో ని వివిధ గ్రామాల రైతుల పొలాల్లో ఉన్న చెట్ల ను ఎలాంటి అనుమతులు లేకుండా మెషీన్ల ద్వారా చెట్లను నరికి లారీల్లో యథేచ్చగా తరలిస్తున్నారు. గత వారం రోజుల నుంచి ఒక్క ము న్నూరుసోమారం గ్రామం నుంచే 65 లారీల వ రకు కట్టెలను తరలించినట్లు పేర్లు చెప్పని కొం తమంది గ్రామస్తులు వివరించారు. ఆదివారం రెండు లారీల్లో కలప నింపుతుండగా గ్రామస్తుల సమాచారంతో విలేకరులు అక్కడికి వెళ్లి వికారాబాద్‌ ఫారెస్టు ఆఫీసర్‌ రాజేందర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారి ఏపీ 12 యు 8718 నంబర్‌ లారీ స్వాధీనం చేసుకొని జిల్లా ఫారెస్టు కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేశామని, జిల్లా ఫారెస్ట అధికారి శ్రీలక్ష్మీ ఆదేశాలతో జరిమానా విధిస్తామని రాజేందర్‌రెడ్డి తెలిపారు. అక్రమ కట్టెల లారీని పట్టుకున్న వెంటనే ఫారెస్ట్‌ అధికారికి ఫోన్‌కాల్‌ రావడం ప్రారంభమైంది. ఆయన ఏ ఫోన్‌కు సమాధానం ఇవ్వకుండా లారీని తీసుకెళ్లడం గమనార్హం. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా