సలసలా మసిలే నూనె పోసి..

17 Sep, 2019 07:46 IST|Sakshi
గాయపడిన వెంకట్రావు

సాక్షి, మార్టూరు (ప్రకాశం): హోటల్‌ యజమాని మందలించాడనే కారణంతో అదే హోటల్‌లో పనిచేసే ఇద్దరు వర్కర్లు సలా సలా మరుగుతున్న నూనెను ఆయనపై పోశారు. ఈ సంఘటన మండల కేంద్రం మార్టూరులో సోమవారం మధ్యాహ్నం జరిగింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. ఇంకొల్లు మండలం భీమవరం గ్రామానికి చెందిన పేర్ని వెంకట్రావు ఆరేళ్ల నుంచి స్థానిక నాగరాజుపల్లి సెంటర్‌లో ఆదిత్య హోటల్‌ నిర్వహిస్తున్నాడు. డేగరమూడికి చెందిన ఇద్దరు సోదరులు అన్నం నరేంద్ర, గోపిలు ఇదే హోటల్లో రెండేళ్ల నుంచి సర్వర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో నరేంద్ర మద్యం తాగి హోటల్‌కు రావడంతో యజమాని వెంకట్రావు మందలించాడు.

మద్యం తాగి వస్తే కస్టమర్లకు ఇబ్బందిగా ఉంటుందని, మద్యం తాగి హోటల్‌కు రావొద్దని హెచ్చరించి కూరగాయల తరిగే పనిలో నిమగ్నమై ఉన్నాడు. యజమాని హెచ్చరికతో నరేంద్ర క్షణికావేశానికి లోనయ్యాడు. పూరీలు వేసేందుకు బాండిలో మరుగుతున్న నూనెను ఒక్కసారిగ్గా యజమాని వెంకట్రావుపై కుమ్మరించాడు. అంతటితో ఆగక నరేంద్ర తన సోదరుడు గోపితో కలిసి యజమానిపై దాడి చేస్తుండగా వెంకట్రావు భార్య స్వప్న అడ్డు వెళ్లింది. ఆమెపై కూడా దాడి చేశారు. అరుపులు, కేకలు విన్న స్థానికులు వారిని విడదీసి వెంకట్రావును స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి అనంతరం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గాయత్రి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్‌

సిద్దిపేట అడిషనల్‌ ఎస్పీ నర్సింహారెడ్డి అరెస్ట్‌

ఎమ్మెల్యే రోజాపై అసభ్య పోస్టింగ్‌లు.. ఫిర్యాదు

హైదరాబాద్‌లో 19 ఏళ్ల యువతి అదృశ్యం

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ : 50 లక్షలు ఇప్పించండి

వైన్స్‌కు కన్నం.. నగదు, మద్యం మాయం!

భర్త వికృత చర్యపై పోలీసులకు భార్య ఫిర్యాదు

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

వింత కేసు; భార్యను లవ్‌ చేయమని..

పీజీ అమ్మాయి.. పదో తరగతి అబ్బాయి

హత్యలు.. భూదందాలు.. సెటిల్‌మెంట్లు !

ఏసీబీకి చిక్కిన వీఆర్‌ఓ

అవినీతి పాపం పండింది

భర్తను చంపి..

భర్త పెద్ద కర్మ.. కుమారుడి దుర్మరణం

నకిలీల ఆటకట్టు..

గ్యాస్‌లీకై పేలుడు

సమత కేసు: ఆధారాలు లేవు

లిస్బన్‌ పబ్‌పై పోలీసుల దాడి.. 

ఉదయం 2 గంటలకు ఫోన్‌ చేసింది.. కానీ

ఒకరు నమ్మించి... మరొకరు బెదిరించి 

గంజాయి ముఠా.. పోలీస్‌ వేట!

చిన్నపాటి నేరాలతో పెరుగుతున్న ఈ–పెట్టి కేసులు!

రెప్పపాటులో ఘోరం 

తరగతిలో ఫ్యాన్‌కు టీచర్‌ మృతదేహం

ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

పోయిన ప్రాణాన్ని దాచారు!

బ్యూటీషియన్‌పై అత్యాచారం ,హత్య

కీచకోపాధ్యాయుడు

తవ్వుతుంటే తప్పు ఒప్పుకున్నారు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ రెండు పాటలతో బన్నీ డబుల్‌ సెంచరీ

బిగ్‌బాస్‌: ‘నువ్వు లేకుండా నేనుండలేను’

రజనీ కొత్త చిత్రానికి కుదిరిన ముహూర్తం

సినిమాలో చూసి ఎంజాయ్‌ చేయడమే : విజయ్‌

సినిమా స్టార్లను వెనక్కునెట్టిన విరాట్‌ కోహ్లి

అలీకి పవన్‌ కల్యాణ్‌ ప్రగాఢ సానుభూతి