మృత్యువే గెలిచింది..!

7 Jul, 2020 13:09 IST|Sakshi
శ్రీనివాస్‌ (ఫైల్‌)

అప్పుల బాధతో రెజ్లింగ్‌ క్రీడాకారుడి ఆత్మహత్యాయత్నం

ఆరు రోజులు చికిత్స పొంది, మృతి

నాడు అనారోగ్యంతో తండ్రి.. నేడు కుమారుడు

బొప్పాపూర్‌లో విషాదం

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): చిన్నతనంలోనే తండ్రి అనా రోగ్యంతో కానరాని లోకా లకు వెళ్లాడు.. తల్లి కూలీ పనులు చేస్తూ నలుగురు కొ డుకులను చదివించింది.. వారు ప్రయోజకులు అవుతుంటే ఆమె మురిసిపోయింది.. ఇంతలో నా లుగో కుమారుడైన రెజ్లింగ్‌ క్రీడాకారుడు శ్రీనివాస్‌ ఆత్మహత్య చేసుకోవడం బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఎస్సై వెంకటకృష్ణ కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన భుజంకార్‌ ఎల్లోజి–బాలమణి దంపతులకు నలుగురు కుమారులు రాజేష్, వంశీ, శివ, శ్రీనివాస్‌ ఉన్నారు. ఎల్లోజి 20 ఏళ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి బాలమణి అన్నీ తానై కుమారులను పెంచింది.

ఎదిగిన కుమారుల్లో శ్రీనివాస్‌ రెజ్లింగ్‌లో జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. మి గతా ముగ్గురు చికెన్, మటన్‌ వ్యాపారం చేస్తున్నారు. క్రీడలకు ఆదరణ తగ్గడంతో శ్రీనివాస్‌ గతకొంతకాలంగా గ్రామంలోనే ఉంటూ సోదరులకు వ్యాపారంలో సహాయ పడుతున్నాడు. కరోనా నేపథ్యంలో వ్యాపారం సాగక అప్పులవడం, అ నారోగ్యం కారణంగా మనస్తాపం చెందిన శ్రీ నివాస్‌ గత నెల 30న పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌ తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సలహాతో హైద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు