-

శ్రీనివాసరెడ్డి అదనపు నేరాలపై పోలీసుల పిటిషన్‌

18 May, 2019 15:34 IST|Sakshi

సాక్షి, నల్గొండ :  హాజీపూర్‌ సైకో, సీరియల్‌ కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డిపై నిర్భయ చట్టం ప్రకారం కేసు పెట్టి, ఉరితీయాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం భువనగిరి కలెక్టర్ అనితా రామచంద్రన్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కేసును వీలైనంత తొందరగా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరపాలని కోరారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, హజీపూర్‌నుంచి మాచనపల్లి గ్రామానికి మధ్య బ్రిడ్జి నిర్మాణం చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్సించాలని కోరారు.

శ్రీనివాసరెడ్డి అదనపు నేరాలపై పోలీసుల పిటిషన్‌
శ్రీనివాస్‌రెడ్డిపై అదనపు నేరాలు చేర్చాలని కోరుతూ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. శ్రీనివాసరెడ్డి అదనపు నేరాలపై ఈ శనివారం యాదాద్రి పోలీసులు నల్గొండ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నల్గొండ కోర్టు సోమవారం విచారణ జరపనుంది. బాలికల హత్య కేసులో నిందితుడైన శ్రీనివాస్‌రెడ్డిని సిట్‌ అధికారుల బృందం విచారిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే పోలీసులు ఎన్ని విధాల ప్రయత్నించినా నిందితుడు నోరుమెదపడం లేదని తెలుస్తోంది. పోలీసుల ప్రశ్నలకు మౌనమే సమాధానంగా వ్యవహరిస్తున్నాడని సమాచారం. పోలీసులు కొద్దిరోజుల క్రితమే హాజీపూర్‌లో క్రైం సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ను పూర్తి చేశారు. గ్రామస్తులు దాడి చేసే అవకాశం ఉందనే సమాచారంతో రాత్రి సమయంలోనే క్రైం సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ పూర్తి చేసినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు