అమ్మా.. నాన్న ఇవే నా చివరి మాటలు

16 Dec, 2019 10:57 IST|Sakshi
సైదుల్లా ఆధార్‌ కార్డు

పాకాల వద్ద యువకుడు ఆత్మహత్య

శోకసంద్రంలో కోటూరు

చిత్తూరు, పాకాల: ‘అమ్మా... నాన్నా ఇక ఇవే నాచివరి మాటలు.  ఇక మీదట నేనుండను, నన్నుక్షమించండి. నేను చనిపోతున్నా’ అంటూ ఓ కన్న బిడ్డ  తల్లిదండ్రులకు  చివరిక్షణంలో మాట్లాడిన మాటలివి. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి.. వివరాలు ఇలా ఉన్నాయి. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో  యువకుడు మృతి చెందాడని గుర్తించి పాకాల రైల్వే పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు చౌడేపల్లె పోలీసుల సహాయంతో సమాచారమిచ్చారు. చౌడేపల్లె మండలం  కోటూరు గ్రామానికి చెందిన ఎస్‌. సయ్యద్‌ అహమ్మద్‌ కుమారుడు సైదుల్లా (23) కూలీ పనిచేసుకొంటూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నారు.

ఈక్రమంలో ఆదివారం  ఇంటి వద్ద నుంచి తల్లిదండ్రులతో గొడవపడి పాకాలకు వెళ్లినట్లు తెలిసింది. అక్కడ నుంచి తన స్నేహితులకు ఫోన్‌ చేసి నేను ఇక ఉండను, చనిపోతున్నానంటూ స్నేహితులకు చెప్పాడని, చివరిసారిగా తన అమ్మా .. నాన్నలతో మాట్లాడించాలని కోరగా వారు అతని సూచనల మేరకు ఫోన్‌లో తల్లితండ్రులకు మాట్లాడించినా ఫలితం లేకపోయింది. పాకాల సమీపంలోని రైల్వే ట్రాక్‌మీద విగతజీవిగా పడి ఉన్న తన  బిడ్డను   చూసిన తల్లితండ్రులు బోరున విలపించారు. కాగా అందరితో ఆప్యాయతతో మెలిగే సైదుల్లా ఇకలేరని తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా భయం: వరుస ఆత్మహత్యలు

డాక్ట‌ర్ల‌పై ఉమ్మివేసిన‌వారి అరెస్ట్‌

లాక్‌డౌన్‌: మహిళను కాల్చి చంపిన జవాను!

తొలి విదేశీ కేసులో ఎన్‌ఐఏ ఎఫ్‌ఐఆర్‌

తండ్రి ప్రేయసిని చంపిన కుమారుడు..

సినిమా

ఫ‌స్ట్ క్ర‌ష్ ఎవ‌రో చెప్పేసిన విక్కీ

పవన్‌ కల్యాణ్‌ను నిలబెట్టిన చిత్రం..

కూతురి శ్ర‌ద్ధాంజ‌లి.. ఓ తండ్రి ఆవేద‌న‌

‘బాహుబలి’ని బ్రేక్‌ చేసిన మహేశ్‌ చిత్రం

ఆ బికినీ ఫొటోకు అంత ఎడిటింగ్ ఎందుకు?

చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నా: హీరోయిన్‌