చెవుడే శాపమైంది

10 Mar, 2020 11:48 IST|Sakshi
మృతి చెందిన షేక్‌ కరిష్మా

మనస్తాపంతో యువతి ఆత్మహత్య  

కర్నూలు ,మహానంది: పుట్టుకతో వచ్చిన చెవుడు ఓ యువతికి శాపమైంది. తన అంగవైకల్యంపై  ఇరుగుపొరుగు వారి సూటిపోటు మాటలకు జీవితంపై విరక్తి చెంది  ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గాజులపల్లెలో సోమవారం  ఈ సంఘటన చోటు చేసుకుంది. మహానంది పోలీసులు తెలిపిన వివరాల మేరకు...  గాజులపల్లెకు చెందిన షేక్‌ ఖాజాహుసేన్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో షేక్‌ కరిష్మా(16)కు చిన్నప్పటి నుంచి చెవుడు ఉంది. ఈ లోపాన్ని ప్రతి ఒక్కరూ పదేపదే గుర్తు చేస్తూ మాట్లాడుతుండటంతో  కుంగిపోయేది.

చివరకు జీవితంపై విరక్తి చెంది ఆదివారం రాత్రి ఎలుకల మందు తాగింది.  తర్వాత వాంతులు చేసుకుంటుండగా   గమనించిన తల్లిదండ్రులు  స్థానిక  ఆస్పత్రికి తీసుకెళ్లారు.  పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి రెఫర్‌ చేశారు.  తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది.  ఈ మేరకు యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు  మహానంది ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తలు