క్షుద్రపూజలు చేయించిందని వేధించడంతో..

19 Nov, 2019 11:02 IST|Sakshi
కవిత మృతదేహం

సాక్షి, హసన్‌పర్తి(వరంగల్‌): క్షుద్ర పూజలు చేయించావంటూ ఓ కుటుంబం చేస్తున్న వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్‌ అర్బన్‌ హసన్‌పర్తి మండలం హరిశ్చంద్రు నాయక్‌ తండాలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. హరిశ్చంద్రునాయక్‌ తండాకు చెందిన కవిత(18) పదో తరగతి పూర్తిచేసింది. ఆమెకు జ్యోతితో పాటు మరో ఇద్దరు యువతులు స్నేహితులు ఉన్నారు. ఇటీవల కోమటిపల్లిలో జ్యోతి ఫొటోకు క్షుద్రపూజలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందుకు కవితే కారణమని జ్యోతి, ఆమె తండ్రి బిక్షపతి, సోదరుడు అనిల్‌ వేధించడం ప్రారంభించారు. క్షుద్ర పూజలు ఎవరు చేశారు, ఎవరు చేయించారో చెప్పాలని వేధించారని కవిత బంధువులు తెలిపారు.

ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వారే బెదిరింపులకు గురి చేశారని కుటుంబసభ్యులు చెప్పారు. దీంతో వారి వేధింపులు భరించలేక కవిత స్థానికంగా ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు జ్యోతి, బిక్షపతి, అనిల్‌ వేధింపులతోనే కవిత ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ ఆమె కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. జ్యోతి ఇంటి ఎదుట మృతదేహంతో ధర్నా చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బంధువులకు నచ్చచెప్పి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్య చేతిలో

వాట్సాప్‌లో సర్పంచ్‌ పేరు పెట్టలేదని..

దారుణం: 8 ఏళ్ల బాలికపై బంధువు అత్యాచారం

ప్రాణం తీసిన 'తబ్లిగి జమాత్‌' వివాదం

హత్య వెనుక ప్రేమ వ్యవహారం

సినిమా

నీలి నీలి ఆకాశం @ 10 కోట్లు!

ఒక్కరికైనా సాయపడండి

రజనీ.. చిరంజీవి.. ఓ ‘ఫ్యామిలీ’!

‘ఏమబ్బా, అందరూ బాగుండారా..’

తమ్మారెడ్డికి చిరంజీవి పరామర్శ

స్టార్‌ కమెడియన్‌ మృతి