‘అమ్మానాన్న' నేను వెళ్లిపోతున్నా..

25 Jun, 2019 07:52 IST|Sakshi
శ్రీనివాస్‌

ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

దౌల్తాబాద్‌ మండలం పొల్కంపల్లి గ్రామంలో విషాదం

గతంలో ఇదే కారణంతో కుమార్తె బలవన్మరణం

ఆరు నెలల్లో ఇద్దర్నీ కోల్పోయిన కుటుంబం

రంగారెడ్డి , దౌల్తాబాద్‌: కడుపులో నొప్పి భరించలేక ఓ విద్యార్థి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దౌల్తాబాద్‌ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ సతీశ్‌ వివరాల ప్రకారం.. పొల్కంపల్లి గ్రామానికి చెందిన పెద్ద నర్సప్ప, పద్మమ్మకు కుమారుడు నాగమొళ్ల శ్రీనివాస్‌ (16). తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లగా శ్రీనివాస్‌ నాన్నమ్మ దగ్గర ఉంటూ గోకఫసల్‌వాద్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అయితే ఆదివారం నాన్నమ్మ పొలం పనులకు వెళ్లగా ఆ సమయంలో శ్రీనివాస్‌ కడుపు నొప్పితో బాధపడ్డాడు.

నొప్పి భరించలేక ‘తన చావుకు ఎవరూ కారణం కాదు’ అని సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం పొలం నుంచి ఇంటికి వచ్చిన నానమ్మ చూసి కంగారుపడింది. వెంటనే చుట్టు పక్కల వారికి సమాచారం అందించి శ్రీనివాస్‌ మృతదేహాన్ని కిందకు దించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు గ్రామానికి చేరుకుని కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని కొడంగల్‌ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. తండ్రి నర్సప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఆరు నెలల వ్యవధిలో ఇద్దరు
తమ కుమారుడి కడుపులో నొప్పి అని ఏనాడు తమకు చెప్పలేదని కుటుంబసభ్యులు వాపోయారు. గతంలో శ్రీనివాస్‌కు ఒక అక్క లక్ష్మి ఉండేది. ఆరు నెలల కిందట లక్ష్మి కూడా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఆత్మహత్య చేసుకుంది. ఆరు నెలల వ్యవధిలో ఇద్దరు పిల్లలను దూరం చేసుకోవడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.  

నేను వెళ్లిపోతున్నా..
‘అమ్మానాన్న నేను వెళ్లిపోతున్నా. ఎందుకంటే నాకు కడుపులో నొప్పిగా ఉంది. అందుకని నేను చనిపోతున్నా. సారీ గుడ్‌ బై’ అని ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడే ముందు సూసైడ్‌ నోటు రాసి పెట్టాడు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నీళ్ల కోసం ఇంత దారుణమా!

డ్రైయినేజీలో ఆలయ హుండీలు!

వైద్యం అందక చిన్నారి మృతి

బాబాయిపై అబ్బాయి బండరాయితో దాడి!

సినీ నటి డాటా చోరీ

ఒకరి వెంట ఒకరు..

ఆ బస్సు ఎక్కితే అంతే సంగతులు..!

అమ్మ ఊరెళ్లిందని చెప్పడంతో..

ఆర్థిక హత్య.. ఆపై క్షుద్ర డ్రామా!

ఐదేళ్ల కుమారుడిని హత్య చేసిన తల్లి

కిలాడీ ‘యాప్‌’తో జర జాగ్రత్త!

కూలి పనులకు వచ్చి కానరాని లోకాలకు..

చికెన్‌ పకోడా అడిగిందని.. చిన్నారి హత్య

హత్యాయత్నానికి దారి తీసిన విగ్రహ తయారీ

టైర్‌ పేలి లారీని ఢీకొన్న ఇన్నోవాకారు

జైలులో జీవిత ఖైదీ ఆత్మహత్య

విషాదం: లిఫ్ట్‌ వైర్ తెగి ఇద్దరి కార్మికుల మృతి

ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ. 5 వేల కోసం..

ఆస్తి వివాదం : 9 మంది మృతి

సీబీఐ వలలో ఎక్సైజ్‌ అధికారి

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్యాయత్నం..!

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..