స్నేహితుడు లేని లోకంలో ఉండలేక..

7 Apr, 2020 13:05 IST|Sakshi

కర్నూలు,సంజామల: వారిద్దరూ మంచి మిత్రులు.. ఒకరినొకరు విడిచి ఉండేవారు కాదు. తరగతి గదిలో పక్కపక్కనే కూర్చునేవారు. ఏమైందో ఏమో నెలరోజుల క్రితం ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్నేహితుడు లేని లోకం తనకు వద్దని  సోమవారం మరో విద్యార్థి బలవంతంగా తనువు చాలించాడు. ఈ విషాద ఘటన ముక్కమళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. నీలి చంద్ర(17) అవుకులో ఐటీఐ చదువుతున్నాడు. చంద్రతో పాటు చదువుతున్న మిత్రుడు నెల రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్నేహితుడు ఫొటోను సెల్‌ఫోన్‌లో చూసుకుంటూ చంద్ర బాధపడుతుండేవాడు. స్నేహితుడు లేని లోకంలో తాను ఉండలేనని తోటి మిత్రులకు చెప్పేవాడు. నీళ్లకు వెళ్తున్నానని చెప్పి సోమవారం ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి బయటికి వెళ్లి.. బాత్‌రూంలో ఉరి వేసుకొని విగతజీవిగా మారాడు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా