ప్రేమించాలని విద్యార్థినికి బెదిరింపులు

4 Apr, 2018 09:15 IST|Sakshi

కళాశాల వద్దకు చాకుతో వచ్చిన యువకుడు

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమం): ప్రేమించాలని వేధింపులకు గురి చేయడమే కాకుండా ప్రేమించకుంటే చంపుతానని చాకుతో కళాశాల వద్దకు వచ్చిన యువకుడిపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..  భవానీపురానికి చెందిన యువతి వన్‌టౌన్‌లోని ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎంబీఏ చదువుతంది. ఆ యువతి గతంలో మహాత్మాగాంధీ రోడ్డులోని కాలేజీలో చదివే రోజులలో సీనియర్‌ అయిన చక్రవరం మహేష్‌ ప్రేమించాలని వెంట పడేవాడు. తనకు అలాంటివి ఇష్టం లేదని చెప్పడంతో కొంత కాలం కనిపించకుండా పోయాడు.

ఇటీవల ఆ యువతికి ఫోన్‌ చేసిన  మహేష్‌ తనను ప్రేమించాలని వేధించసాగాడు. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో కళాశాల వద్ద ఉండగా మహేష్‌ అక్కడకు వచ్చి తనను ప్రేమించాలని వేధించసాగాడు. అంతేకాకుండా మహేష్‌ చేతిలోని ఫోన్‌ కింద చాకు ఉండటంతో ఆ యువతి వెంటనే తన తండ్రికి సమాచారం ఇచ్చింది. తండ్రి వచ్చిన తర్వాత ఆ యువతి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్నేహితుడు లేని లోకంలో ఉండలేక..

కొడుకు ఆత్మహత్య.. వెళ్లలేని స్థితిలో తల్లిదండ్రులు

రిమ్స్ వైద్యుడిపై పోలీసులకు ఫిర్యాదు

తబ్లీగి జమాత్‌: క్రిమినల్‌ కేసు నమోదు.. అరెస్టు

మద్యం డోర్‌ డెలివరీ అంటూ రూ. 50వేలు టోకరా

సినిమా

పెద్దాయన సన్‌ గ్లాసెస్‌ వెతకండ్రా

రూ.1.25 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన అజిత్‌

టిక్‌టాక్ వీడియోపై ర‌ష్మి ఆగ్ర‌హం

క‌రోనా : న‌టి టిక్‌టాక్ వీడియో వైర‌ల్‌

నటుడి కుటుంబానికి కరోనా.. ధైర్యం కోసం పోస్టు!

మాస్క్‌లు వ‌దిలేసి, చున్నీ క‌ట్టుకోండి: విజ‌య్