మాయ మాటలతో బాలికను లొంగదీసుకుని..

29 Jun, 2020 10:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మహబూబ్‌ నగర్‌ : మండలంలోని బావాయిపల్లికి చెందిన 13 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆరునెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత కుటుంబం ఆదివారం ఉదయం యువకుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగటంతో విషయం బయటకు వచ్చింది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన వినోద్‌కు పిండి గిర్నీ ఉంది. అదే గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక తరచూ పిండి పట్టించుకునేందుకు గిర్నీకి వచ్చేది. మాయమాటలు చెప్పి లోబర్చుకొని అత్యాచారం చేస్తున్నాడు. ఈ నెల 25న బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆమెను బైక్‌పై ఎక్కించుకొని పెద్దకొత్తపల్లి వైపు తీసుకెళ్తుండగా గుర్తించిన గ్రామస్తులు తల్లిదండ్రులకు విషయం చెప్పారు. ( తండ్రి స్నేహితుడి ఘాతుకం)

దీంతో వారు కుమార్తెను నిలదీయగా విషయం చెప్పింది. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం ఆదివారం వినోద్‌ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు చేయించనున్నట్లు వివరించారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా