యువకుడి దారుణ హత్య

24 Oct, 2018 06:55 IST|Sakshi
పెదకోడాపల్లి ఎలిమెంటరీ పాఠశాల వరండాలోని అనీల్‌కుమార్‌ మృతదేహం

 సోమవారం రాత్రి గొంతుకోసి హతమార్చారు

వివాహేతర సంబంధమే కారణం?

విశాఖపట్నం, పెదబయలు(అరకులోయ): మండలంలోని పెదకోడాపల్లి గ్రామ సమీపంలో  గ్రామానికి చెందిన మండి అనీల్‌కుమార్‌(30)అనే యువకుడి గొంతుకోసి  దారుణంగా  హత్య చేశారు.  దీనికి సబం« దించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదబయలు మండలం పెదకోడాపల్లికి  చెందిన  మండి అనీల్‌కుమార్‌ కొన్నేళ్ల పాటు  పాడేరు మండలం చింతలవీధి పంచాయతీ కుమ్మరిపుట్టు(నర్సరీ పక్కన) తన అన్న వదినలు మండి రామకృష్ణ, అమ్మలు ఇంట్లో నివాసం ఉన్నాడు. గత ఏడాది భారీగా ఖర్చు చేసి   అనీల్‌కుమార్‌కు అన్న వదినలు వివాహం చేశారు. ఏడాది పాప కూడా ఉంది. ఇటీవల కుటుంబ గొడవల వల్ల అవి తగ్గేంత వరకు కుమార్తెతో సహా తన భార్య కుమారిని అనీల్‌కుమార్‌ ఆమె పుట్టింటికి పంపాడు.

పెదకోడాపల్లి గ్రామంలో ఉన్న వరుసకు  మేనబావ అయిన కొమ్మ గోపాల్‌రావు ఇంట్లో   నెల రోజులుగా ఉంటున్నాడు.  సోమవారం సాయంత్రం నుంచి ఇంటికి చేరలేదు. ఎక్కడికో వెళ్లి ఉంటాడని అనుకున్నామని   గోపాల్‌రావు కుటుంబ సభ్యులు తెలిపారు.  గ్రామ సమీ పంలోని ప్రాథమిక పాఠశాల వరండాలో  ఎవరో పడుకుని ఉన్నారని  మంగళవారం ఉదయం స్థానిక పిల్లలు  సమాచారం అందించారని  కొమ్మ గోపాల్‌రావు తెలిపాడు. వెళ్లి చూడగా  రక్తం మడుగులో అనిల్‌కుమార్‌ మృతి చెంది ఉన్నాడని చెప్పా రు. తన అల్లుడ్ని దారుణంగా హత్య చేసిన నింది తుల్ని పట్టుకుని ఉరి తీయాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. పెడకోడాపల్లి, కుమ్మరిపుట్టులో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

పథకం ప్రకారం హత్య
అనీల్‌కుమార్‌ హత్య పథకం ప్రకారం జరిగినట్టు  సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే అర్థమవుతోంది. ఐదు క్వార్టర్‌ ఎంసీ బాటిళ్లు, నాలుగు బీరుబాటిళ్లు, మరో మద్యం బాటిల్‌ సంఘటన స్థలానికి సమీపంలో ఉన్నా యి. హత్య జరిగిన సమయంలో అక్కడ ఐదుగురు మద్యం తాగినట్టు డిస్పోజబుల్‌ గ్లాసుల బట్టీ తెలుస్తోంది. అనీల్‌కుమార్‌ను కూడా పూట గా మద్యం తాగించి పథకం ప్రకారం హత్య చేసి ఉంటారనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వివాహేతర సంబంధమే  కారణమా?
వరుసకు వదిన అయిన మహిళతో ఇతనికి వివాహేతర  సంబంధం ఉందని తెలిసింది. కుటుంబ గొడవలు, ఇతర కారణాల వల్ల నెల రోజుల క్రితం  ఇతని అన్నయ్య,వదిన మండి రామకృష్ణ,అమ్మలు కలిసి అనీల్‌కుమార్‌పై  పాడేరు పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పటి నుంచి  అనీల్‌కుమార్‌ తన భార్య కుమారి, పాపను పుట్టింటికి పంపి తన మేనమామ  ఊరు పెదకోడాపల్లిలో ఉంటున్నా డు.   అయితే  అనీల్‌కోసం  రామకృష్ణ ఐదు సార్లు ఫోన్‌ చేశాడని గోపాల్‌రావు తెలిపారు. కుటుంబ గొడవల కారణంగా హత్య జరిగిందా? లేద ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే  కోణంలో  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  మంగళవారం మృతదేహాన్ని పాడేరు తరలించి పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు.   పాడేరు సీఐ అప్పలనాయుడు, పెదబయలు ఎస్‌ఐ రామకృష్ణారావు  దర్యాప్తు  చేస్తున్నారు.

మరిన్ని వార్తలు