పక్కా ప్లాన్‌తో; భయానక స్థితిలో మృతదేహం

28 Aug, 2019 08:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : తన మేనకోడలిని ప్రేమిస్తున్నాడనే కోపంతో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చాడో యువకుడు. మృతుడి ముఖాన్ని కూడా గుర్తుపట్టడానికి కూడా వీల్లేకుండా కాల్చి పాశవికంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నివారాలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.... ప్రమోద్‌(20) అనే వ్యక్తి మేనకోడలు, వారి దూరపు బంధువు అంకిత్‌ అనే యువకుడు కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రమోద్‌.. మేనకోడలికి దూరంగా ఉండాల్సిందిగా అంకిత్‌ను హెచ్చరించాడు. అదేవిధంగా అతడి తల్లిదండ్రులకు కూడా విషయం చెప్పి కొడుకును మందలించాలని సూచించాడు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని కోపోద్రిక్తుడైన ప్రమోద్‌.. అంకిత్‌ అడ్డుతొలగించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు ప్రకాశ్‌(22)తో కలిసి అంకిత్‌ హత్యకు పథకం రచించాడు. ఇందులో భాగంగా హర్యానాలో ఉద్యోగం చేస్తున్న అంకిత్‌కు ఆగస్టు 23న ఫోన్‌ చేసి యూపీకి రప్పించాడు. అదేరోజు పార్టీ చేసుకుందామని చెప్పి ప్రమోద్‌, ప్రకాశ్‌లు అంకిత్‌ను ఓ పాడుబడ్డ ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకువెళ్లారు. అనంతరం అంకిత్‌తో మద్యం తాగించి వెంట తెచ్చుకున్న నాటు తుపాకీలతో కాల్చి అతడి ముఖాన్ని ఛిద్రం చేశారు. తర్వాత శవాన్ని అక్కడే పడేసి ఢిల్లీకి పారిపోయారు. 

కాగా ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఫ్యాక్టరీ దగ్గర మనిషి శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ నేపథ్యంలో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు అంకిత్‌ మృతదేహం గురించి ఎలాంటి ఆనవాలు దొరకలేదు. ముఖం గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఛిద్రం కావడం, శరీరమంతా పురుగులతో నిండిపోవడం, ఓ కాలును తిన్న జంతువులు సగం కాలును అక్కడే వదిలేసి వెళ్లడం వంటి భయానక స్థితిలో ఉన్న అంకిత్‌ శవాన్ని గుర్తించడం వారికి సవాలుగా మారింది. మరోవైపు అతడు హర్యానాలో ఉద్యోగం చేస్తుండటంతో తల్లిదండ్రులకు కూడా అతడు యూపీకి వచ్చిన విషయం తెలియదు. దీంతో మిస్సింగ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ఈ క్రమంలో అంకిత్‌ కాల్‌డేటా ఆధారంగా విచారణ జరుపగా అసలు నిజాలు వెలుగు చూశాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని ద్వారకాలో తలదాచుకున్న ప్రమోద్, ప్రకాశ్‌లను సోమవారం అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా వారిద్దరు నేరాన్ని అంగీకరించినట్టు పేర్కొన్నారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పరారీలో  మాజీ విప్‌ కూన రవికుమార్‌

సవతే హంతకురాలు

పాన్‌షాప్‌తో జీవితం ప్రారంభించి.. గుట్కా డాన్‌గా..!

ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలి 

హుండీ దందా గుట్టురట్టు 

ఎలా వచ్చాడో.. అలాగే వెళ్ళాడు..

‘క్యూనెట్‌’పై ఈడీ

స్వామిపై లైంగిక ఆరోపణలు, బాధితురాలు మాయం

అత్యాచారం.. ఆపై ఆమెకే శిక్ష

క్యూనెట్‌ స్కాంలో 70 మంది అరెస్టు

సుబ్బరామిరెడ్డి అన్న కొడుకు ఇంట్లో భారీ చోరీ

తండ్రి వివాహేతర సంబంధం.. కుమార్తె ఆత్మహత్య

రమేష్‌ హత్య వెనుక రహస్యాలనేకం..!

మరో వ్యక్తితో చనువుగా ఉంటుందని..

బైక్‌ మోజులో పడి.. మేనత్తకే కన్నం

గంటలో మూడు ఫోన్లు చోరీ

బడా బిజినెస్‌మెన్‌ అంటూ వలేస్తాడు

‘పార్శిల్స్‌’ కేసులో నిందితుడి అరెస్టు

పేషెంట్‌ బ్యాగు తీసి పక్కన పెట్టినందుకు..

చీటింగ్‌ కేసులో తల్లీకొడుకు అరెస్ట్‌

జిల్లాలో ఉగ్రవాదులు లేరు: సీపీ కార్తికేయ

ఎట్టకేలకు మోసగాళ్ల అరెస్ట్‌ 

వ్యభిచారం చేయమని వేధిస్తున్న తండ్రి అరెస్టు!

మూడేళ్ల బాలుడిపై లైంగిక దాడి

కాటేసిన కాలువ

చిన్న దొంగ అనుకుంటే.. పెద్ద ‘చేప’ దొరికింది

పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య

లవ్‌ ఆర్ట్స్‌ పేరుతో కాల్‌ సెంటర్‌.. డేటింగ్‌ ఆఫర్స్‌

శిశువును ఒడిలో దాచుకుని బాలింత ప్రాణత్యాగం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అర్జున్‌ మేనల్లుడి పొగరు

తరగతులకు వేళాయె!

నెయిల్‌ పాలిష్‌... మస్త్‌ ఖుష్‌

బేబీ బాయ్‌కి జన్మనివ్వబోతున్నాను

మా ఆయుధం స్వార్థత్యాగం

క్లాష్‌ వస్తే నిర్మాతలే నష్టపోతున్నారు