మొబైల్‌ కొనివ్వలేదని అఘాయిత్యం  

4 Sep, 2019 08:40 IST|Sakshi

రైలుకిందపడి యువకుడి ఆత్మహత్య 

సాక్షి, తాడిపత్రి(అనంతపురం) : మొబైల్‌ కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. అనంతపురంలోని గుల్జార్‌పేటలో నివాసముంటున్న హెచ్చెల్సీ ఉద్యోగి జయరామిరెడ్డి కుమారుడు యశ్వంత్‌ (20) బెంగుళూరులోని ఓ కళాశాలలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదువుతున్నాడు. తండ్రి కొనిచ్చిన ఖరీదైన మొబైల్‌ ఫోన్‌ను ఇటీవల పోగొట్టుకున్నాడు. తనకు మరొక మొబైల్‌ కొనివ్వాలని యశ్వంత్‌ అడగ్గా.. కొద్దిరోజులు ఆగితే కొనిస్తానని తండ్రి చెప్పాడు.

ఈ క్రమంలో యశ్వంత్‌ వినాయక చవితి పండుగకు తాడిపత్రిలోని తన చిన్నాన్న రామ్మోహన్‌రెడ్డి ఇంటికి వచ్చాడు. తండ్రి తనకు మొబైల్‌ కొనివ్వలేదన్న మనస్తాపంతో సోమవారం ఉదయం కోమలి రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు సుబ్బారెడ్డి, వరప్రసాద్, రాజశేఖర్‌రెడ్డిలు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇది చదవండి : రైలు నుంచి విద్యార్థి తోసివేత

మరిన్ని వార్తలు