ప్రేమికుడి ఇంటి ఎదుటే ప్రేమికురాలు..

21 Nov, 2018 13:25 IST|Sakshi
అపస్మారక స్థితిలో పడిఉన్న యువతిని ఆస్పత్రికి తరలిస్తున్న స్థానికులు

అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ సెంట్రల్‌): ప్రేమికుడి ఇంటి ఎదుటే ప్రేమికురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విజయవాడ నగరంలోని పాయకాపురం శాంతినగర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన మంగళవారం నగరంలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ వన్‌టౌన్‌ కొత్తపేట ప్రాంతానికి చెందిన యువతి(28) కేబీఎన్‌ కళాశాలలో ఎంబీఏ వరకూ చదువుకుంది. తనతోపాటు డిగ్రీ చదువుకున్న పాయకాపురం శాంతినగర్‌ ప్రాంతానికి చెందిన దారం గోపి(29)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఎంబీఏ కూడా పూర్తిచేసిన తరువాత పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. చదువు పూర్తయ్యాక గోపి ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.

అప్పటి నుంచి ప్రేమించిన యువతితో సరిగా మాట్లాడకపోవడం చేస్తుండడంతో మనస్తాపానికి గురైన ఆ యువతి గతంలో కూడా ఇదే మాదిరిగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గోపిని, వారి కుటుంబ సభ్యులను సంప్రదించారు. విషయం పోలీసులు దాకా వెళ్లడంతో టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కొన్ని నెలల కిందట కేసు నమోదైంది. పెద్దలు, పోలీసుల సమక్షంలో గోపి, అతని తల్లిదండ్రులు నవంబర్‌లో గానీ డిసెంబర్‌లో గానీ యువతిని పెళ్లిచేసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. గోపికి గత నెలలో వేరే యువతితో అతని తల్లిదండ్రులు వివాహం చేసేశారు. విషయం తెలుసుకున్న ఆ యువతి మంగళవారం శాంతినగర్‌లోని ప్రేమికుడి ఇంటికి వెళ్లి అక్కడ బ్లీచింగ్‌ పౌడర్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు హూటాహూటిన సంఘటనా స్థలానికి చేరి సమీపంలోని ఆమెను ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. గతంలో టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు ఉన్న నేపధ్యంలో నున్న రూరల్‌ పోలీసులు కేసును అక్కడికి పంపారు. పోలీసులు ప్రేమికుడి కుటుంబ సభ్యులను విచారిస్తున్నట్లు తెలిసింది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఊరంతా షాక్‌.. మహిళ మృతి

ఇద్దరు బిడ్డలను చంపిన తల్లి 

వడదెబ్బ; కాప్రా టీపీఎస్‌ మృతి

కన్నతల్లి కర్కశత్వం.. నోట్లో గుడ్డలు కుక్కి..

కుప్పంలో భారీ వర్షం..రైతు మృతి

భార్యను కుక్క కరిచిందని..

ఇటుకలు మీద కూలి ఓ చిన్నారి.. విషాదం

రూ. 7.5 కోట్ల నకిలీ కరెన్సీ; నలుగురి అరెస్టు

సూరత్‌ అగ్ని ప్రమాదం : ముగ్గురి మీద ఎఫ్‌ఐఆర్‌

భార్యపై అనుమానం.. గొడ్డలితో నరికి హత్య

దారుణం.. నడిరోడ్డుపై రెచ్చిపోయిన గో రక్షకులు

విమానంలో భయంకర చర్య, వైరల్‌ వీడియో

ముక్కు ఆపరేషన్‌ కోసం వెడితే దారుణం

అత్తింటి వేధింపులు తాళలేక అల్లుడి ఆత్మహత్య

కీచక మామ కోడలిపై..

బాలుడి కిడ్నాప్‌ సుఖాంతం

భర్త గొంతు కోసి హైడ్రామా

సీనియర్ల వేధింపులు : మెడికో ఆత్మహత్య

ప్రియురాలు మాట్లాడటం లేదని..

నాడు ముగ్గురు.. నేడు ఒకరు

తండ్రి మందలించాడని..

భార్య మృతితో గుండె పగిలిన భర్త

రవిప్రకాశ్‌కు చుక్కెదురు 

‘హీరా’ కేసులో ఆడిటర్‌ సాయం!

కోచింగ్‌ సెంటర్‌లో మంటలు.. 20 మంది విద్యార్థుల దుర్మరణం

నూజివీడులో ఘోరం

ఎన్సీఎల్టీలో రవిప్రకాష్‌కు చుక్కెదురు!

భార్యపై అనుమానం..కూతురి హత్య

ఘోర అగ్నిప్రమాదం; 15 మంది విద్యార్థులు మృతి!

స్కూటీ నడుపుతుండగా బీపీ వచ్చి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హాలీవుడ్‌ మళ్లీ పిలిచింది

పెళ్లి వద్దు... పిల్లలు కావాలి

లెక్కలు చెప్పేదాన్ని!

మెంటల్‌ రైడ్‌

బుద్ధిమంతుడు

అమెరికాలో సైలెంట్‌గా...