పెళ్లికి ప్రియుడు నిరాకరించాడని..

10 Oct, 2018 07:21 IST|Sakshi
విలపిస్తున్న తల్లి సోములమ్మ, చికిత్స పొందుతున్న కుమారిని కేజీహెచ్‌కు తరలిస్తున్న దృశ్యం

విశాఖపట్నం, సబ్బవరం(పెందుర్తి): తనను ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ఓ యువతి పురుగులు మందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించింది. మంగళవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఇరువర్గాల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నాయనమ్మపాలెంన కు చెందిన గెంజి కుమారి (23), రావులమ్మపాలెంనకు చెందిన షేక్‌ రెహమాన్‌ (23) క్లాస్‌ మేట్లు. వేర్వేరు కులాలకు చెందిన వీరిద్దరూ గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొన్నాళ్లగా సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. ఏడోతరగతి నుంచే వీరిద్దరి మధ్యా సాన్నిహిత్యం ఉన్నట్టు చెబుతున్నారు. అయితే కుమారిని పెళ్లి చేసుకుంటానని తుదవరకు నమ్మించి ఇటీవలే నిరాకరించడంతో ఇరువర్గాల పెద్దలు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అయితే ఆమెతో తాను కలిసి తిరిగిన మాట వాస్తవమేనని, కోపిష్టి అని, పెళ్లిచేసుకునేది లేదని రెహమాన్‌ తెగేసి చెప్పేశాడు. ఇలా రెండుమూడుసార్లు పెద్దలు పంచా యితీ పెట్టినా ఫలితం దక్కలేదు. మంగళవారం కూడా కౌన్సెలింగ్‌ జరిగింది.

రెహమాన్‌ పెళ్లి ఊసెత్తకపోవడంతో విసు గు చెందిన కుమారి పంచాయితీ జరిపిన చోటే తన వెంట తెచ్చుకున్న పురుగులు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమించడంతో 108వా హనంలో కేజీహెచ్‌కు పంపించారు. రెహమాన్‌ లంకెలపాలెంలో బీటెక్‌ చదువుతున్నాడు. కుమారి ఇటీవలే బీఈడీ పూర్తి చేసింది. కుమారి ఆత్మహత్యకు పాల్పడడంతో ఆమె తల్లి సోములమ్మ బోరున విలపిస్తోంది. గతంలోనూ వివా దం పోలీస్‌స్టేషన్‌కు చేరినా లిఖితపూర్వక ఫిర్యా దు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. మంగళవారం నాటి ఘటనపైనా తమకెలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ ఎన్‌. ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కారు ఢీకొని ముగ్గురి మృతి

ప్రేయసిని తగులబెట్టిన ప్రియుడు..

ప్రింటెడ్‌ స్లిప్‌ అడిగినందుకు డ్రంకన్‌ డ్రైవ్‌ కేసు పెట్టారు

‘మానాన్న పోలీసు.. మానాన్న మాజీ ఎంపీ’ ! 

ప్రేమ విఫలమై ఓ మహిళా పోలీసు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరోయిన్‌ కోసం బాయ్‌ఫ్రెండ్స్‌ ఫైట్‌

అంతకు మించి...

మ్యాడసన్‌ @ సైలెన్స్‌

వేసవిలో క్రైమ్‌ కామెడీ

మా సినిమా యూత్‌కు మాత్రమే

ఎవరికీ చెప్పొద్దు!