ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య

18 Oct, 2017 03:23 IST|Sakshi

అక్కన్నపేట(హుస్నాబాద్‌): మూడేళ్లు ప్రేమించి.. పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సిద్దిపేట జిల్లా జనగామ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. పూదరి మేఘమాల(23) ఎంసీఏ పూర్తిచేసి ఇంటి వద్దే ఉంటోంది. బంధువైన గౌరవెల్లి నివాసి హరిప్రసాద్, ఆమె మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఇంతలో హరిప్రసాద్‌ మరో పెళ్లికి సిద్ధం అవుతున్న విషయం తెలిసి.. మేఘమాల నిలదీయడంతో అతను పెళ్లికి నిరాకరించాడని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె సోమవారం రాత్రి నూనెలో నెయిల్‌పాలిష్‌ కలుపుకొని తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. మృతురాలి తండ్రి బతుకుదెరువు కోసం వలస వెళ్లగా.. ఇంటి వద్ద తల్లి, ఇద్దరు మగ పిల్లలు ఉంటున్నారు. 

మరిన్ని వార్తలు