ఉద్యోగం దొరక్క, కుటుంబాన్ని పోషించలేక

22 Sep, 2019 15:55 IST|Sakshi

కర్ణాకటలో యువతి ఆత్మహత్య

బెంగళూరు:  కుటుంబ బాధ్యతలను మోస్తున్న యువతికి ఉన్న చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగం పోయింది. మరో ఉద్యోగం కోసం ఎంతో వెతికింది, ఎక్కడా పని దొరకలేదు. ఒకవైపు నిరుద్యోగం, మరోవైపు కుటుంబ బాధ్యతలతో దిక్కుతోచని యువతి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. అది కూడా మతిస్థిమితం లేని తమ్ముడి ముందే. గుండెల్ని పిండేసే ఈ దారుణ సంఘటణ బెంగళూరుకు సమీపంలో ఉన్న ఆనేకల్‌ తాలూకాలోని అత్తిబెలెలో శనివారం చోటు చేసుకుంది. అక్కడి నాగలింగేశ్వర స్వామి దేవాలయం వీధిలో నివాసం ఉంటున్న మంజుళ (22) ఆత్మహత్య చేసుకున్న యువతి. ఆమె తల్లి, చెల్లి, మతి స్థిమితం సరిగా లేని తమ్ముడితో కలిసి ఉంటోంది.
 
ఉద్యోగం కోల్పోయి..
మంజుల అత్తిబెలిలో ఉన్న గార్మెంట్స్‌లో పని చేసింది. ఆ జీతంతో కుటుంబాన్ని పోషిస్తోంది. ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గిపోవడంతో ఇటీవలే గార్మెంట్స్‌వారు మంజుళను పని నుంచి తీసివేశారు. ఉద్యోగం కోసం పలు గార్మెంట్స్‌ నిర్వాహకులను కలిసింది. కానీ ఎక్కడా పని లభించక పోవడంతో ఆవేదనకు లోనైంది. శనివారం ఉదయం మతిస్థిమితం సరిగా లేని తమ్ముని ముందే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అంగడికి సరుకుల కోసం వెళ్లిన తల్లి తిరిగి వచ్చి చూడగా కుమార్తె ఉరికి వేలాడడం చూసి గట్టిగా కేకలు పెట్టింది. దాంతో చుట్టు పక్కల వారు వచ్చి చూడగా అప్పటికే మంజుళ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆత్తిబెలి పోలిసులు సంఘటన స్థలానికి వచ్చి పరిసిలన జరిపి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు