కామాంధుడి నుంచి తప్పించుకున్న యువతి

11 May, 2018 13:52 IST|Sakshi
సున్నం బాబూరావుతో ఎస్సై శ్రావణ్‌ కుమార్‌   

గుండాల : ఓ కామాంధుడి నుంచి గిరిజన యువతి తప్పించుకుంది. ఆమె ఫిర్యాదుతో ఆ కామాంధుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్సై  శ్రావణ్‌ కుమార్‌ తెలిపిన వివరాలు... మండలానికి చెందిన ఓ గిరిజన యువతి, ఇల్లందు నుంచి గుండాలకు వచ్చేందుకు మంగళవారం రాత్రి 7.00 గంటల సమయంలో ఇల్లందు ఆర్టీసీ బస్టాండుకు చేరింది. ఆ సమయంలో బస్సు లేవు. మామకన్ను గ్రామస్తుడైన సున్నం బాబూరావుకు చెందిన టాటా మ్యాజిక్‌ ఎక్కింది.

తన గ్రామ సమీపంలో దింపాలని కోరింది డ్రైవర్‌ సరేనన్నాడు. ‘‘సాయనపల్లిలో దిగాల్సిన వారున్నారు వారిని అక్కడ దింపేసి, నిన్ను నీ ఊరి దగ్గర దింపుతా’’నన్నాడు. ఆమె సరేనంది. తన ఊరికి వెళ్లేందుకుగల మరో మార్గం మీదుగా వాహనం వెళుతుండడాన్ని గమనించి, తాను అక్కడ దిగుతాననంది. ‘‘వీరందరినీ దింపేసి, నిన్ను మీ ఊళ్లో వదిలేస్తా’’నని డ్రైవర్‌ మరోసారి నమ్మించాడు తిరుగు ప్రయాణంలో సాయనపల్లి–గుండాల మార్గం మధ్యలోని కిన్నెరసాని వద్ద వాహనాన్ని అతడు ఆపాడు.

లైంగిక దాడి చేయబోయాడు. ఆమె గట్టిగా అరుస్తూ తప్పించుకుని రోడ్డు వైపు పరుగెత్తింది. తమ ఊరి పక్కనున్న గ్రామానికి చెందిన ముగ్గురు కనిపించారు. వారికి విషయం చెప్పింది. వారి సాయంతో ఇంటికి క్షేమంగా చేరుకుంది. జరిగినదంతా తన కుటుంబీకులకు, బంధువులకు తెలిపింది. అందరూ కలిసి అదే రో జు రాత్రి కిన్నెరసాని వెంట ఆ టాటా మ్యాజిక్‌ కోసం వెతుకుతూ గుండాలకు చేరుకున్నారు. గుం డాల గ్రామ శివారులో ఆగిన ఆ టాటా మ్యా జిక్‌ను ధ్వంసం చేశారు. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు