ఆరునెలల క్రితం ప్రేమ వివాహం.. అంతలోనే..

8 Sep, 2019 08:31 IST|Sakshi

వేధింపులే కారణమని మృతురాలి బంధువుల ఆరోపణ 

రిమ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు

సాక్షి, కడప : పరస్పరం ప్రేమించుకుని ఆరునెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. జీవితాంతం తోడునీడగా ఉండాల్సిన భర్త, తన తల్లిదండ్రులతో కలిసి భార్యను అనుమానించడమే గాక, వరకట్న వేధింపులకు గురి చేయడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనపై పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. 

కడప నగరం  రిమ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వడ్డెపల్లెకు చెందిన రామరాజు హైదరాబాద్‌లో టైలర్‌ వృత్తి చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆ సమయంలో ఇంజినీరింగ్‌ చదువుతున్న నెల్లూరు జిల్లా వెంకటాంపల్లెకు చెందిన హారతి(19)తో పరిచయం ఏర్పడింది. పరస్పరం ప్రేమించుకుని ఆరునెలల క్రితం వివాహం చేసుకున్నారు. మూడు నెలల క్రితం తన భార్య హారతిని, భర్త రామరాజు కడపలోని తన తల్లిదండ్రుల ఇంటికి తీసుకుని వచ్చాడు. ఇటీవల కొన్ని రోజుల నుంచి భర్తతో పాటు, అత్త,మామ, ఆడబిడ్డ, ఆమె భర్త, భర్త అన్నలు సూటిపోటి మాటలతో హారతిని వేధింపులకు గురి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన హారతి ఈనెల 6 వ తేదీన ఇంటిలో ఎవరూ లేని సమయంలో బాత్‌రూంలోని పైకప్పునకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని రిమ్స్‌ మార్చురీకి తరలించారు. కడప తహసీల్దార్‌ శివరామిరెడ్డి ఆధ్వర్యంలో శవపంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం శనివారం మృతదేహాన్ని తండ్రి బాబులుకు అప్పగించారు. ఆయన ఫిర్యాదు మేరకు భర్తతో పాటు, మిగిలిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి. సత్యబాబు తెలిపారు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాలమూరు జైలుకు నవీన్‌రెడ్డి

వేసుకున్న దుస్తులు మిషన్‌కు తగులుకుని..

తక్కువ ధరకే బంగారం అంటూ ఏకంగా..

ఆటలో గెలిచి.. చిన్న మాటకే జీవితంలో ఓడి..

నిర్మానుష్య వీధి.. బాబుతో కలిసి మహిళ వెళ్తుండగా..!

కోడలి అక్రమసంబంధం అత్తకు తెలిసి..

మహిళ అనుమానాస్పద మృతి

మత్తులో ఉన్న మహిళలే టార్గెట్‌

ఏటీఎం పగులకొట్టి..

మైకుల వైర్లు కట్‌ చేయించిన ఎస్సై!

కల్యాణలక్ష్మి డబ్బు కావాలని భర్త వేధింపులు

భర్తను చంపినా కసి తీరక...

మృత్యు గెడ్డ

అనైతిక బంధానికి అడ్డొస్తున్నాడనే..

ఆపరేషన్‌ దొంగనోట్లు

పగలు మెకానిక్‌.. రాత్రి బైక్‌ల చోరీ

కాపురానికి రాలేదని భార్యను..

కన్నకూతురిపైనే అఘాయిత్యం 

లభించని చిన్నారి ఆచూకీ

కారును ఢీకొట్టి.. కత్తులతో బెదిరించి.. 

వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ దాడి

అవినీతిలో ‘సీనియర్‌’ 

పోలీస్‌ స్టేషన్‌కు తుపాకులతో వచ్చి..

మంచిర్యాలలో విస్తరిస్తున్న గంజాయి

మరోసారి చంద్రబాబు కుట్ర బట్టబయలు

కులం పేరుతో దూషణ; ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసైన మైనర్‌; తండ్రికే టోపి

‘వేలిముద్రల మార్పిడి’ ముఠా అరెస్టు

మితిమీరిన వేగం తెచ్చిన అనర్థం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ ఆశ ఉంది కానీ..!

కథానాయికలే కష్టపడుతున్నారు!

‘మేకప్‌తోనే అందం వస్తుందంటే నమ్మను’

ప్రముఖ సినీ గీతరచయిత కన్నుమూత

ఒక్క సెల్ఫీ భాయ్‌!

ప్రమోషన్స్‌కు సైరా