అన్నని చంపిన తమ్ముడు

16 Jul, 2020 07:58 IST|Sakshi
గ్రామçస్తులకు నచ్చజెబుతున్న సీఐ స్వామిగౌడ్‌

శివ్వంపేట(నర్సాపూర్‌) : పొలం వద్ద చోటుచేసుకున్న ఘటనలో అన్నపై తమ్ముడు పారతో దాడి చేసిన ఘటనలో చికిత్స పొందుతూ అన్న మృతి చెందడంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి అల్లీపూర్‌ గ్రామంలో మంగళి మల్లేశ్‌ సొంత అన్నను మూడు రోజుల క్రితం పొలం వద్ద పారతో దాడి చేశాడు. తలతో పాటు పలు చోట్ల తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతు మంగళవారం మృతిచెందాడు. అకారణంగా అన్నపై దాడి చేసి మరణానికి కారణామైన మల్లేశ్‌పై బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తు మంగళవారం రాత్రి మల్లేశ్‌ ఇళ్లు కూల్చి వేశారు. గొవడ జరిగిన అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో తెలిపినప్పటికీ ఎస్‌ఐ రమేశ్‌ స్పందించలేదని అతడిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేసేంత వరకు అంత్యక్రియలు జరగనివ్వమని ఆందోళనకు దిగారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు మల్లేశ్‌ని గ్రామానికి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. తూప్రాన్‌  డీఎస్పీ కిరణ్‌కుమార్, డివిజన్‌ పరిధిలో తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్‌ సీఐలు స్వామిగౌడ్, నాగార్జున గౌడ్, నాగయ్యలతో పాటు ఎస్‌ఐలు సిబ్బంది భారీగా గ్రామానికి మోహరించారు. 

అన్ని విధాలుగా ఆదుకుంటాం
బాధిత రాములు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని  డీఎస్పీ కిరణ్‌ కుమార్, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. నిందితుడిపై  చట్ట ప్రకారం చర్యలు తీసుకోని బాధిత కుటుంబానికి మల్లేశంకు సంబంధించిన 30 గుంటల భూమి ఇప్పించే విధంగా ఒప్పందం చేశారు. అనంతరం సాయత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఇళ్లు కూల్చివేసిన వారిపై అలాగే పోలీసుల విధులకు ఆటంకం ఏర్పరిచిన వారిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు సీఐ స్వామి గౌడ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు