పెళ్లి పీటలెక్కాల్సిన వ్యక్తి  శవమయ్యాడు 

8 May, 2018 10:06 IST|Sakshi
 రమేష్‌ మృతదేహం, (ఇన్‌సెట్‌లో ఫైల్‌)  

 హత్యా..ఆత్మహత్యా..

అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

ఎంపీపటేల్‌గూడ పొదల్లో కాలిన మృతృదేహం లభ్యం

ఇబ్రహీంపట్నంరూరల్‌/ మంచాల రంగారెడ్డి : రెండు రోజు లైతే పెళ్లి.. హాయిగా వివాహం చేసుకొని దాంపత్య జీవితం గడపాల్సిన యువకుడు శవమై కనిపించాడు. కాలిన గాయాలతో ఓ వెంచర్లో మృతదేహం బయటపడింది. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. సీఐ గోవింద్‌రెడ్డి కథనం ప్రకారం.. మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన దన్నె వెంకటయ్య, ఐలమ్మల ప్రథమ కుమారుడు దన్నె రమేష్‌. మార్కెటింగ్‌ చేస్తూ జీవనం సాగిస్తుంటాడు.

రమేష్‌కు అదే మండలంలోని దాద్‌పల్లి గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి కాయమైంది. రోజులాగే ఆదివారం రాత్రి ఇంటి నుంచి తన ఆటోను తీసుకొని విధులకు వెళ్లాడు. ఆదివారం సాయంత్రం తిరిగి ఇంటికి రాలేదు. తెల్లవారే సరికి ఇబ్రహీంపట్నం మండల పరి«ధిలోని ఎంపీపటేల్‌గూడ గ్రామంలోని ఓ వెంచర్‌లో ట్రాలీ ఆటో పక్కనే కాలిన గాయాలతో రమేష్‌(25) శవమై కనిపించాడు. 

రమేష్‌ మృతిపై ఎన్నో అనుమానాలు.. 

రెండు రోజుల్లో పెళ్లిపీఠలు ఎక్కాల్సిన రమేష్‌ అనుమానస్పదంగా మృతిచెందడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రమేష్‌ను పెట్రోల్‌ పోసి కాల్చి హత్య చేశారా..? లేక అతనే ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? అనే విషయం తేలలేదు. మృతదేహం పక్కనే కొద్ది దూరంలో మద్యం బాటిల్‌ పడి ఉంది. వాంతులు చేసుకున్నట్లు అనావాళ్లు కనిపించాయని పోలీసులు తెలిపారు.

మంటలకు తాళలేక పక్కనే ఉన్న నీటితొట్టిలోకి వెళ్లి మునిగినట్లు పోలీసులు అను మానం వ్యక్తం చేశారు. ట్రాలీ ఆటోలో కాలిన ఉ న్న ఆనవాళ్లు చూసి మంటలకు తట్టుకోలేక ట్రా లీని స్టార్ట్‌ చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేసి చివరకు కిందపడ్డాడా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి క్లూస్‌ టీం, డాగ్‌స్క్వాడ్‌తో సో దాలు చేయించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టు మార్టం నిర్వహించి కుటుంబీలకు అప్పగించారు.  

ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు.. 

పసుపు పారాని పెట్టుకొని పెళ్లిపీటలు ఎక్కాల్సిన రమేష్‌ ఆకస్మిక మరణం పెను విషాదం నింపింది. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో మరణ మృదంగం మోగడంతో రెండు ఇళ్లలో విషాదం చోటు చేసుకుంది. రమేష్‌ మృతిపట్ల ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఎంతో ఆశతో పెళ్లి కోసం ఎదురుచూసిన కుటుంబసభ్యులు, బంధువులు  రమేష్‌ మృతిని తట్టుకోలేక గుండెలలిసేలా రోదించారు. విషాదఛాయల మధ్య రమేష్‌ అంత్యక్రియలు ముగిశాయి.

>
మరిన్ని వార్తలు