చిన్నారి నోట్లో బాంబు పేల్చి..

8 Nov, 2018 10:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో : దీపావళి పండుగ సంబరాల్లో భాగంగా యూపీలో దారుణం చోటుచేసుకుంది. మిలాక్‌కు చెందిన ఓ యువకుడు తన రాక్షసానందం కోసం మూడేళ్ల చిన్నారి నోట్లో బాంబు పెట్టి పేల్చాడు. వివరాలు... మిలాక్‌కు చెందిన చిన్నారి తన ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్న సమయంలో, అటుగా వెళ్తున్న హర్పాల్‌ అనే యువకుడు ఆమెను తనతో పాటు తీసుకువెళ్లాడు.

ఈ క్రమంలో తన దగ్గర ఉన్న సుతిల్‌ బాంబు చిన్నారి నోట్లో పెట్టి అంటించాడు. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని, బతికే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. కాగా ఘటనపై చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.   

>
మరిన్ని వార్తలు