మద్యం మత్తులో మృత్యువుతో ఆట.. విషాదం!

22 Apr, 2019 19:55 IST|Sakshi

చంద్రగిరి : మద్యం మత్తులో ఓ యువకుడు స్నేహితులను ఆటపటించాలనుకున్నాడు. తాను చనిపోతున్నానంటూ ఫ్రెండ్స్‌కు వీడియో కాల్‌ చేశాడు. వారి ముందు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నటించాలనుకున్నాడు. అందులో భాగంగా చీరను తీసుకుని ఫ్యానుకు కట్టి మెడకు ఉరి బిగించుకున్నాడు. ఇంతలోనే మెడకు ఉరి బిగిసింది. ఉరి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు కానీ.. ఫలితం లేకపోయింది. సరదా కోసం అనుకుంటూ.. ప్రమాదకరమైన మృత్యువు కోరల్లో చిక్కి.. స్నేహితులు చూస్తుండగానే ప్రాణాలు విడిచాడు.

చిత్తూరు జిల్లా, తిరుచానూరు సమీపంలోని దామినీడులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. దామినీడుకు చెందిన శివకుమార్ అనే యువకుడు మద్యంలో మత్తులో స్నేహితులకు వీడియో కాల్ చేశాడు. తాను చనిపోతున్నానంటూ వారిని ఆటపట్టించాలనుకున్నాడు. కానీ మద్యం మత్తులో ఉన్న అతను నిజంగానే ఉరి బిగించుకొని ప్రాణాలు విడిచాడు. తమ కళ్లముందే శివకుమార్ ఆత్మహత్య చేసుకుంటాడని అతని స్నేహితులు ఊహించలేకపోయారు. ఏదో హడావుడి చేస్తున్నాడులే అనుకున్నారు. వీడియోకాల్ చూస్తుండగానే ఘోరం జరిగిపోయింది. తొలుత ఊరి వేసుకుంటున్నట్టు శివకుమార్ తన మెడకు చీరతో ముడివేశాడు. కాలు కింద పెట్టాడు. ఈ క్రమంలో ఉరి బిగుసుకున్న తర్వాత.. శివకుమార్ ఆ ఉరి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, అప్పటికే చీర మెడకు బిగుసుకుపోయింది. క్షణాల్లోనే ప్రాణం పోయింది. ఈ ఘటన శివకుమార్ కుటుంబంలో విషాదం నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శంకరమఠంలో దొంగలు పడ్డారు..!

అప్పు కట్టలేదని ఇంట్లోకి చొరబడి..

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

మహిళ అనుమానాస్పద మృతి

కాలేజీ బ్యాగ్‌లో కోటి రూపాయలు 

చెవి కత్తిరించిన రౌడీ షీటర్‌ అరెస్ట్‌

కొడుకా సురేశా..

ఏం తమాషా చేస్తున్నవా ‘డీసీపీ రెడ్డి’ని మాట్లాడుతున్నా..!

ప్రియుడి కోసం.. బాబును, భర్తను చంపేసింది

తప్పిన పెనుప్రమాదం

ప్రేమ వేధింపులతో బాలిక ఆత్మహత్య

ప్రొఫెసర్‌కు మెయిల్‌ పంపి..

కామాంధుడికి బుద్ధిచెప్పిన అక్కాచెల్లెళ్లు

కాంగ్రెస్‌ నాయకురాలి అనుమానాస్పద మృతి..!

నగరం చూపిస్తానని చెప్పి భర్త ఘాతుకం

ఆర్టీసీ బస్సు బోల్తా.. 20మందికి గాయాలు

కిలోల కొద్దీ వెండి, బంగారు ఆభరణాలు..!

పొట్టకూటికెళ్లి పై లోకాలకు

మినీబస్సు దూసుకెళ్లి తల్లి, కుమార్తె దుర్మరణం

చేపల వేటలో మత్స్యకారుడి దుర్మరణం

శారదా చిట్‌ఫండ్‌ కేసులో కొత్త మలుపు

పెళ్లి కాలేదన్న వేదనతో డాన్సర్‌ ఆత్మహత్య

గర్భిణిని హత్య చేసి బిడ్డను దొంగిలించారు

మామ లైంగిక వేధింపులతో కోడలు ఆత్మహత్య

వెంబడిస్తూ వేధింపులు.. భారత యువకుడికి జైలు

రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలు 

పుట్టిన రోజుకు డబ్బులు ఇవ్వలేదని..

నాలుగు ప్రభుత్వ విభాగాలను వాడేసిన ఘనుడు

కొనసాగుతున్న వేట

కండక్టర్‌ అవమానించాడని..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ తరహా సినిమాలో త్రిష రాణించేనా!

సంక్రాంతికి ఇండియన్‌–2

అమ్మతో గొడవపడ్డ సమంత!

దేశాన్ని రక్షించేది రైతు, సైనికుడే :మహేష్‌బాబు

రత్నంలాంటి నటుడు

కాన్స్‌లో మన క్వీన్స్‌