యువత గంజాయ్‌

25 Sep, 2017 10:58 IST|Sakshi

జోరుగా వ్యాపారం

యువత, విద్యార్థులే టార్గెట్‌

సిగరెట్లలో గంజాయి మిశ్రమం

చాపకింద నీరులావిస్తరిస్తున్న దందా

సొమ్ము చేసుకుంటున్నస్మగ్లర్లు

సాక్షి, మోర్తాడ్‌(బాల్కొండ): స్మగ్లర్లు విద్యార్థులనే లక్ష్యంగా గంజాయి విక్రయాలను కొనసాగిస్తున్నారు. సిగరేట్లలోని తంబాకును తొలగించి గంజాయి పొడిని కలిపి యువతకు విక్రయిస్తున్నారు. గంజాయి మిశ్రమం గల సిగరేట్ల విక్రయాలు కొన్ని రోజులుగా జోరుగా సాగుతున్నాయని ప్రచారం సాగుతోంది. గంజాయి మిశ్రమం గల సిగరేట్లు, చాక్లెట్ల్‌ విక్రయాలు గతంలో నిజామాబాద్‌లో వెలుగు చూసిన విషయం విధితమే. అయితే వీటి వ్యాపారం తాజాగా మోర్తాడ్, భీమ్‌గల్, ఆర్మూర్, వేల్పూర్, కమ్మర్‌పల్లి ప్రాంతాలకు విస్తరించినట్లు తెలిసింది. గంజాయి సిగరేట్ల విక్రయాల జోరుతో వాటిని పీల్చుతున్న యువకులు బేజారు అవుతున్నారు. మద్యం సేవించగా వచ్చే మత్తుకంటే గంజాయితో ఎక్కువ పాళ్లు ఉండడంతో అనేక మంది యువకులు గంజాయికి బానిసవుతున్నారు.  

ఒక్కోసారి ఒక రకంగా ధర...
గంజాయి ధర ఎప్పుడు ఒకేలా ఉండదు. సాధారణం గా 50 గ్రాముల గంజాయి ధర రూ.200 వరకు ఉం టుంది. అయితే గంజాయి కొరత ఏర్పడితే లేదా వినియోగించేవారి సంఖ్య పెరిగితే ధరలో మార్పు వస్తుంది. గంజాయికి బానిసైన వారి పరిస్థితిని అంచనా వేస్తు న్న వ్యాపారులు ఒక్కోసారి 50 గ్రాములకు రూ.500ల నుంచి రూ.వెయ్యి వరకు వసూ లు చేస్తున్నారు. గంజాయి మిశ్ర మం సిగరేట్ల ధర రూ.100 నుంచి రూ.150 వరకు ఉన్నట్లు తెలిసింది. ఒక సిగరేట్‌ను ఇద్దరు, ముగ్గురు యువకు లు తాగుతూ మత్తులో జోగుతున్నారు. గం జాయితీ సుకోవడంతో వాసన రాదు. దీంతో గంజాయికి బానిసలై న వారిని గుర్తించడం కొంత కష్టమే. అయితే గంజాయికి బా నిసలైనవారి వికృత చేష్టలను పసిగడితేనే బాధితులకుకౌన్సెలింగ్‌ చేసే అవకాశం ఉంది.

వేధిస్తోన్న సిబ్బంది కొరత..
గంజాయిని నిర్మూలించేందుకు నిర్దేశించిన ఎక్సైజ్‌ శాఖ లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో గంజాయి ముఠాలపై దాడులకు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. గం జాయి స్మగ్లర్ల ముఠాలపై నిఘా ఉంచాలంటే ఎక్సైజ్‌ శాఖలో సిబ్బందిని పెంచాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో మోర్తాడ్, భీమ్‌గల్, ఆర్మూర్, నిజామాబాద్, బోధన్, కామా రెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద, దోమకొండ ఎక్సైజ్‌ స్టేషన్‌లు ఉన్నాయి. సీఐ, ఎస్‌ఐ ల పోస్టులు భర్తీ అయినా హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ పోస్టులు అనేకం ఖాళీ ఉన్నాయి. అంతేకాక ఉన్న సిబ్బందికి వైన్స్‌ ల వేలం, మద్యం అమ్మకాలపై నిఘా, కల్లు విక్రయాలపై నిఘా, సారా నిందితులకు పునరావాస చర్యలు చేపట్టడం వంటి పనులతో సిబ్బంది ఎప్పుడూ బిజీగా ఉంటున్నారు. దీంతో గంజాయి స్మగ్లర్ల ముఠాపై నిఘా ఉంచే సమయం వారికి దొరకడం లేదు. దీంతో ప్రత్యేక నిఘా పెట్టలేకపోతున్నామని సమాచారం వస్తేనే దాడులు చేస్తున్నామని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు.

నిషేధం ఉన్నా ‘సాగు’తోంది..
గంజాయిపై నిషేధం అమలులో ఉన్నా దాని వ్యాపా రాన్ని మాత్రం పోలీసు, ఎక్సైజ్‌శాఖ అధికారులకు కావడంలేదు. వారు తీవ్రంగా కృషి చేస్తున్నా స్మగ్లర్ల ఆటను కట్టించలేక పోతున్నారు. గంజాయి విక్రయాలతో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఆర్జణకు అవకాశం ఉంది. దీంతో స్మగ్లర్లు ఈ వ్యాపారా న్ని వీడటం లేదు. స్మగ్లర్ల ముఠాలోని సభ్యులు ఎవరైనా పట్టుబడితే బయట ఉన్నవారు వ్యాపారాన్ని కొ నసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని భీమ్‌గల్, సిరికొండ, కమ్మర్‌పల్లి, గాంధారి, మాచారెడ్డి, వర్ని మం డలాల్లోని అటవీ ప్రాంతాల్లో కొంత మేర గంజాయి సాగవుతున్నట్లు తెలిసింది. అయితే ఈ ప్రాంతంలో సాగయ్యే గంజాయితోపాటు ఏపీలోని విశాఖపట్న ం, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి రైలు ద్వారా నిజా మాబాద్‌కు సరఫరా అవుతోంది. రైల్వే స్టేషన్‌ వరకు చేర్చకుండా స్మగ్లర్లు కొన్ని సిగ్నల్స్‌ను గుర్తుంచుకుని గంజాయి మూటలను పడేసి రహస్య ప్రాంతాల్లో ని లువ ఉంచుతున్నారు. స్మగ్లర్ల ముఠా సభ్యుల సంఖ్య బాగానే ఉండటంతో నెట్‌వర్క్‌ పలు ప్రాంతాలకు విస్తరించింది. ప్రధానంగా చేపూర్, మాక్లూర్‌ మండలంలోని దాస్‌నగర్‌ ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి.

బాధితులకు కౌన్సెలింగ్‌ చేయాలి..
గంజాయికి అలవాటు పడినవారికి కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. కౌన్సిలింగ్‌ నిర్వహించడంతో బాధితుల్లో మార్పు రావచ్చు. గంజాయి వినియోగంతో కలిగే నష్టాలను తెలుసుకుంటే మరోసారి గంజాయి వినియోగించరు.    –డాక్టర్‌ రవికుమార్, మోర్తాడ్‌

మరిన్ని వార్తలు