తల్లి ప్రియుడిని చంపిన యువకుడు

20 May, 2019 08:48 IST|Sakshi

న్యూఢిల్లీ: తండ్రి స్థానంలో తండ్రిలా వచ్చిన వ్యక్తి... కూతురు వరుసయ్యే తన చెల్లెలిపై లైంగిక వేధింపులకు పాల్పడుతుండడం చూడలేకపోయిన ఓ యువకుడు... మారుతండ్రిని హత్యచేశాడు. స్థానికంగా కలకలం క్రియేట్‌ చేసిన ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది.

న్యూఢిల్లీలోని బాబా హరిదాస్‌ నగర్‌లో 20 ఏళ్ల కొడుకు, 15 ఏళ్ల కూతురితో నివాసం ఉంటోంది ఓ మహిళ. ఆమె భర్త 2012లో ఓ ప్రమాదంలో చనిపోయాడు. ఆ తర్వాత అదే ఏరియాకు చెందిన ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోందామె. ఫలితంగా వీరికి ఓ ఏడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. భర్తకు పుట్టిన పిల్లలతో ఆమె ఓ ఇంట్లో నివసిస్తుంటే... ఏడేళ్ల కుమారుడితో కలిసి ప్రియుడు మరో ఇంట్లో ఉండేవాడు. అయితే ప్రియురాలి ఇంటికి సమీపంలో ఓ షాపు నడిపిస్తున్న అతను, అప్పుడప్పుడు ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న 15 ఏళ్ల బాలికపై కన్నేశాడు. బుధవారం ఆమె ఇంటికి వెళ్లిన అతను... ఒంటరిగా ఉన్న బాలికను లైంగికంగా వేధించడం మొదలెట్టాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆమె అన్న... కూతురు వయసయ్యే బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని చూసి షాకయ్యాడు.

తీవ్ర ఆవేశంతో అక్కడే ఉన్న కత్తిని తీసుకుని దాడి చేసి... అతన్ని కసి తీరా పొడిచి చంపాడు. తర్వాత పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. పోలీసులు వచ్చే దాకా వేచి చూసి... తర్వాత లొంగిపోయాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో వారి తల్లి, పని మీద బయటికి వెళ్లడం విశేషం. చెల్లెలిపై అత్యాచారానికి యత్నిస్తున్న తల్లి ప్రియుడిని చూడగానే ఆవేశానికి లోనై, కత్తితో పొడిచి చంపేసినట్టు ఒప్పుకున్నాడు సదరు యువకుడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి ఉపయోగించిన కత్తిని సీజ్‌ చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చిత్తురులో నకిలీ నోట్ల ముఠా గట్టురట్టు

కట్టడి లేని కల్తీ దందా

ఆర్మీ పేరుతో గాలం !

పెంపుడు కుక్క చోరీ

ఆర్థిక ఇబ్బందులతో బ్యూటీషియన్‌..

హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక..

బంగారం అలా వేసుకు తిరిగితే ఎలా?..

పొలం పనికి వెళ్లి.. విగతజీవిగా మారాడు 

అక్క ఆస్తి కబ్జాకు తమ్ముళ్ల కుట్ర

బిగ్‌బాస్‌ నిర్వాహకులకు నోటీసులు 

అప్పు తీసుకున్న వ్యక్తి మోసం చేశాడని..

ఒకే బైక్‌పై ఐదుగురు.. ముగ్గురి మృతి

ప్రియుడే హంతకుడు.. !

అవినీతి జబ్బు!

బొల్లినేని గాంధీపై ఈడీ కేసు

కట్టుకున్నవాడే కడతేర్చాడు

కోల్‌కతాలో సైనికుడి మృతి

మొదట ఇంటి దొంగల వేట.. ఎస్పీ అభిషేక్‌ మహంతి

కన్నా.. ఎక్కడున్నావ్‌?

కార్‌ డోర్లు లాక్‌.. ఇద్దరు పిల్లల మృత్యువాత

మాజీ మహిళా మేయర్‌ దారుణ హత్య..!

నలుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తల అక్రమ అరెస్టు

భర్త హత్యకు సుపారీ.. సొమ్ము కోసం ఇల్లు అమ్మకం

మిర్యాలగూడలో విషాదం..!

చనిపోయి.. తిరిగొచ్చిందా?

కు.ని చికిత్స చేసుకున్న మహిళ మృతి

పోలీసులే మహిళతో..

బొల్లినేని గాంధీపై ఈడీ కేసు

ఘోర రోడ్డు ప్రమాదం

తృణమూల్‌ కార్యకర్త దారుణ హత్య..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అప్పుడే సిగరెట్‌ తాగడం మానేశా: నటి

అందుకే పెళ్లి చేసుకోలేదు : సల్మాన్‌

అన్నీ గుర్తుపెట్టుకుంటా; ఐశ్‌ భావోద్వేగం!

తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రానా

ప్రయాణం ముగిసింది; మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా!

‘సాహో’తో సై!