ముసుగులు ధరించి దాడి.. వీడియో వైరల్‌ !

12 Apr, 2018 19:22 IST|Sakshi

మథుర: పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ యువకుడ్ని కొంతమంది ముసుగులు ధరించి కర్రలతో చితకబాదారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలివి.. ‘ కొద్దికాలంగా ఓ వ్యక్తి నుంచి నాకు బెదిరింపులు వస్తున్నాయి. గత హోలీ వేడుకల సమయంలో అతనిపై నేను పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. అందుచేతనే వారు ఈ దారుణానికి దిగారు’ అని బాధితుడు పేర్కొన్నారు.

ఈ ఘటనపై బాధితుడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తి అరెస్టు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ దాడిపై నెటిజన్లు మండిపడ్డారు. ఎన్‌కౌంటర్‌ చేసే పోలీసుల ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. వావ్‌.. ఉత్తరప్రదేశ్‌లో లా అండ్‌ అడర్‌ అభివృద్ది చెందిందని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు