హైదరాబాద్‌లో అక్రమంగా సెక్స్‌ డ్రగ్స్‌ తయారీ

3 May, 2019 20:43 IST|Sakshi

హైదరాబాద్‌: నగరంలో లైంగిక సామర్ధ్యాన్ని పెంపొందించే మందుల్ని అక్రమంగా తయారు చేస్తోన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. కెటమైన్‌ అనే మత్తు మందును ఐదేళ్లుగా ఇంతం ల్యాబ్‌ తయారు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బెంగుళూరులో ఇద్దరు వ్యక్తులు పట్టుబడటంతో హైదరాబాద్‌లోని ఇంతం ల్యాబ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మందులు మహిళలపై వాడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. అలాగే బెంగుళూరులో పట్టుబడిన ముఠా నుంచి కీలక సమాచారాన్ని తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు రాబట్టారు.

ఆ ముఠా ఇచ్చిన సమాచారంతో నాచారంలో ఉన్న ఇంతం ల్యాబ్‌లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. క్షుణ్ణంగా సోదాలు నిర్వహించిన అనంతరం ఇంతం ల్యాబ్‌ను డ్రగ్స్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు సీజ్‌ చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్‌ తీసుకోవడం వల్ల ఐదు గంటల పాటు అపస్మారక స్థితిలో ఉంటారని అధికారులు చెబుతున్నారు. మనిషిలో సెక్స్‌ హార్మోన్లు పెరిగేలా మందులు తయారు చేస్తోన్నట్లు తమ విచారణలో వెల్లడైందని, దీనికి సంబంధించి ఇంతం ల్యాబ్‌ యజమాని వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

Read latest Crimeillegally-making-sex-drugs-hyderabad-1186286 News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు