స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలి

9 Sep, 2016 01:42 IST|Sakshi
వీరన్నపేట (మహబూబ్‌నగర్‌) : తెలంగాణ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌ డిమాండ్‌ చేశారు. గురువారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల విద్యార్థులు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్‌ మాట్లాడుతూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉద్యోగుల జీతాలను మూడింతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచి విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించకపోవడం వల్ల విద్యార్థుల నుంచి కళాశాలల యాజమాన్యాలు పరీక్ష ఫీజులను తీసుకోవడం లేదని అన్నారు. దీంతో విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ప్రభుత్వం బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌ చార్జీలను పెంచాలని డిమాం డ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నూరు రాజు, కార్యదర్శి ఓంప్రకాష్, నాయకులు వెంకట్రాములు, బాలరాజు, అంజి, నరేష్, నవీన్, శివ, గోపి, రఘు తదితరులు పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు