'గడీల పాలన - తాకట్టులో తెలంగాణ' పుస్తకావిష్కరణ

14 Jul, 2017 08:51 IST|Sakshi

లండన్ :
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో టీపీసీసీ తయారుచేసిన పీపుల్స్ ఛార్జ్ షీట్ పుస్తకాన్ని లండన్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ  ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రసమితి పాలనలో సామాన్యులు పడుతున్న అవస్థలు, వివిధ రంగాల్లో అడ్డగోలు వ్యవహారాలపై రాసిన 'గడీల పాలన -తాకట్టులో తెలంగాణ' పుస్తకాన్ని శ్రవణ్ ఆవిష్కరించారు.

దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. అమరుల బలిదానాల సాక్షిగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ఒంటెద్దు పోకడలకు పోకుండా, ఓట్లు సీట్లు ఆలోచన లేకుండా ప్రజల కోసం పనిచేయాలని సీఎం కేసీఆర్‌కి సూచించారు. 

అడ్వైజరీ మెంబర్లు డోకుర్ పవన్ కుమార్, ఓరుగంటి కమలాకర్ రావు, యూకే కన్వీనర్ గంప వేణుగోపాల్ తదితరులు ప్రసంగించి  ప్రభుత్వ పని తీరుపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు రంగుల సుధాకర్ గౌడ్, రామ్మోహన్ రెడ్డి, రాకేష్ బిక్కుమండ్ల, అచ్యుత రెడ్డి, సత్య ప్రకాష్ , రాజేశ్వేర్ రెడ్డి, దేవులపల్లి శ్రీనివాస్, మధు గట్ట, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు