డల్లాస్లో 'ధిరుక్ ధిరుక్ తిల్లాన' ఆల్బమ్ విడుదల

10 Apr, 2017 17:39 IST|Sakshi
డల్లాస్లో 'ధిరుక్ ధిరుక్ తిల్లాన' ఆల్బమ్ విడుదల

డల్లాస్ :
'ధిరుక్ ధిరుక్ తిల్లాన' మ్యూజిక్ ఆల్బమ్ విడుదల వేడుకని డల్లాస్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి 250 మందికి పైగా సంగీత అభిమానులు హాజరయ్యారు.

భారతీయ సంగీతాన్ని ఎంతగానో అభిమానించే రాజశేఖర్ సూరిబోట్ల ఈ ఆల్బమ్కు మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించారు. మొత్తం ఆరుపాటలున్న ఈ ఆల్బమ్లో ఒక్కో పాటకు విభిన్నశైలిలో బాణీలను సమకూర్చారు. ఈ ఆల్బమ్ కు లక్ష్మీనాగ్ సూరిబొట్ల, చంద్రబోస్, డా.వడ్డెపల్లి క్రిష్ణ, శ్రీనివాస మౌళీలు పాటలు రాయగా,  సంతోష్ కమ్మంకర్, రమ్య బెహర, సుమంగళి, ప్రణవి ఆచార్య, సాయి శివాణిలు తమ గాత్రాన్ని అందించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పద్మా కమ్మంకర్ వ్యవహరించారు. ఈ ఆల్బమ్ రూపొందించడంలో నవీన్, రాజ్శేఖర్,  రాజా, కళ్యాణ్, కిరణ్, సిరిల్లు వివిధ విభాగాల్లో పని చేశారు.


ఈ సందర్భంగా ఆల్బమ్ను ఆవిష్కరించిన ప్రసాద్ తోటకూర సంగీత అభిమానుల కోసం రాజశేఖర్ సూరిబోట్ల చేస్తున్న కృషిని కొనియాడారు. అంతేకాకుండా లోకల్ టాలెంట్ను గుర్తించి వారికి అవకాశాలు ఇస్తున్నందుకు సూరి బోట్లను అభినందించారు. అనంతరం సూరిబోట్ల మాట్లాడుతూ.. ఈ ఆల్బమ్ను తయారు చేయడానికి సహకరించివారందరికి కృతజ్ఞతలు తెలిపారు.


డా. నరసింహారెడ్డి ఉరిమిడి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, శారద సింగిరెడ్డి, శ్రీనివాస్ ప్రబల, నాగలక్ష్మీ సంతానగోపాలన్, లక్ష్మీ నాగ్ సూరిబోట్లలు ఆల్బమ్లోని ఒక్కో పాటను విడుదల చేశారు. కాగా, ఆర్పీ పట్నాయక్, సురేష్ మాధవపెద్ది, చంద్రబోస్, వడ్డెపల్లి క్రిష్ణ, శ్రీనివాస్ మౌళి, శ్రీ కృష్ణలు వీడియో ద్వారా ధిరుక్ ధిరుక్ తిల్లాన టీంకు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు