కువైట్ ప్రగతిలో ఎన్నారైలే కీలకం

9 Nov, 2013 08:43 IST|Sakshi

కువైట్ దేశ ప్రగతిలో ఎన్నారైలు కీలక భూమిక పోషిస్తున్నారని ఆ దేశ ప్రధాని షేక్ జబ్బర్ అల్ ముబారక్ అల్ హమిద్ అల్ సబ కీర్తించారు. భారత పర్యటలో భాగంగా ఆయన శుక్రవారం రాత్రి న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో భారత్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్తో భేటీ అయ్యారు. కువైట్ దేశాభివృద్ధిలో ఎన్నారైలు అందిస్తున్న సేవలను ఈ సందర్బం ఆయన ప్రధాని మన్మోహన్కు వివరించారు. తమ దేశంలో 7 లక్షల మంది ఎన్నారైలు ఉన్నారని ఆయన ఈ సందర్భంగా ప్రధాని మన్మోహన్కు గుర్తు చేశారు.



కువైట్, భారత్ దేశాల అనుబంధానికి వారు వారధిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కువైట్లో ఎంతోమంది విదేశీయులు ఉన్నారని, కానీ ఎన్నారైలది ప్రత్యేకమైన శైలీ అని చెప్పారు. భారత దేశ సంస్కృతికి, ప్రగతులకు ఎన్నారైలు నిలువెత్తు నిదర్శనమని అల్ హమిద్ అల్ సబ చెప్పారు.  దేశంలో ప్రైవేట్ రంగంలో ఎన్నారైలు అందింస్తున్న సేవలను కువైట్ ప్రధాని భారత్ ప్రధానికి ఈ సందర్భంగా విశదీకరించారు.

మరిన్ని వార్తలు