ప్రఖ్యాత గ్రూట్ షర్ ఆసుపత్రి సీఈఓగా భావనా పాటిల్

9 Aug, 2013 16:39 IST|Sakshi

రోగుల అవసరాలను తెలుసుకుని తదనుగుణంగా వారికి సేవలందిస్తానని దక్షిణాఫ్రికాలోని ప్రముఖ ఎన్నారై వైద్యురాలు భావనా పాటిల్ శుక్రవారం కేప్టౌన్లో వెల్లడించారు. ఆ దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రూట్ షర్
ఆసుపత్రి కార్యనిర్వహాణాధికారిగా ఇటీవలే నూతన పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకునే రోగుల సంఖ్య నానాటికి పెరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు చేసే సమయాన్ని మరింత పెంచుతామన్నారు.


గత ఎనిమిదేళ్లుగా ఇదే ఆసుపత్రిలో మెడికల్ మేనేజర్గా  భావనా  విధులు నిర్వర్తిస్తున్నారని వెస్టరన్ కేప్ ప్రోవెన్షియల్ మినిస్టర్ ఫర్ హెల్త్ త్యియునస్ బొతా తెలిపారు. అలాగే ఆమె ఆధ్వర్యంలోనే శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని చెప్పారు. శస్త్ర చికిత్సల నిర్వహాణలో ఆమెకు సుదీర్ఘ అనుభవం ఉందని, ఈ నేపథ్యంలో భావనా పాటిల్ను ఆ పదవికి ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఆ పదవికి భావన సరైన వ్యక్తి అని ప్రోవెన్షియల్ కేబినెట్ ప్రగాఢంగా విశ్వసిస్తుందని బొతా చెప్పారు.


భావనా పాటిల్ స్టెలెన్బాష్ యూనివర్శిటీ నుంచి ఫ్యామిలీ మెడిసన్లోమాస్టర్ డిగ్రీ అందుకున్నారు. అనంతరం జోహెన్స్బర్గ్లోని విట్వాటర్స్టాండ్ యూనివర్శిటీ నుంచి బయైథిక్స్తోపాటు హెల్త్ లా  లోకూడా  మాస్టర్ డిగ్రీని కూడా  అందుకున్నారు. ఫ్యామిలీ హెల్త్ స్పెషలిస్ట్గా భావన పాటిల్ ఆ దేశ మెడికల్ కౌనిల్స్లో రిజిస్టర్ చేయించుకున్నారు.  దక్షిణాఫ్రికాలోని గ్రూట్ షర్ అసుపత్రిని 1938లో స్థాపించారు. 1967లో డిసెంబర్ 3న ఆ ఆసుపత్రిలోనే ప్రముఖ వైద్యుడు క్రిస్టియన్ బెర్నార్డ్ ప్రపంచంలోనే మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు