తెలంగాణకు టీఎన్నారైలే కీలకం

5 Jun, 2016 11:58 IST|Sakshi
తెలంగాణకు టీఎన్నారైలే కీలకం

డల్లాస్ :  తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో టీ ఎన్నారైలు కీలక పాత్ర పోషిస్తున్నారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు జితేందర్ రెడ్డి ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వానికి మీరంతా పూర్తి సహాయ సహకారాలు అందించాలని టీ ఎన్నారైలకు ఆయన పిలుపునిచ్చారు. తొలిసారిగా ప్రపంచ తెలంగాణ సమావేశాలు డల్లాస్‌లో అట్టహాసంగా ప్రారంభమమైన సంగతి తెలిసిందే. అందులోభాగంగా ఆదివారం డల్లాస్ నగరంలో తెలంగాణ ఎన్నారైల రాజకీయ చర్చా వేదిక నిర్వహించారు. ఈ చర్చా కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి, డీకే అరుణా, మధుయాష్కీగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

ఈ చర్చా కార్యాక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో ఎన్నారైల పాత్రను ప్రస్తుతించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను మరింతగా ప్రజల్లోకి వెళ్లేలా చర్యలు చేపట్టాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో వాచ్ డాగ్స్ వలే వ్యవహరించాలని ఎన్నారైలకు ఉత్తమ్ సూచించారు. తెలంగాణ ఎన్నారైలకు గోబల్ తెలంగాణ కన్వెన్షన్ ఓ వేదికగా ఉపయోగపడుతోందన్నారు. అందుకు నిర్వాహాకులు అధ్యక్షుడు విశ్వేశ్వరరెడ్డి, ఉపాధ్యక్షుడు విజయ్ పిట్టా లక్ష్మణ్, సెక్రటరీ ప్రవీణ్ కాశీ రెడ్డి, ఎఫ్బీఐ ట్రస్టీ అజయ్ రెడ్డి, రవిశంకర్ పటేల్లను ధన్యవాదాలు తెలిపారు. ది హిందూకు చెందిన రవికాంత్ రెడ్డి ఈ చర్చావేదికలో అనుసంధానకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి డేటా(డల్లా ఏరియా తెలంగాణ అసోసియేషన్), టీప్యాడ్(తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్) సంస్థలు కూడా మద్దతిచ్చాయి.





మరిన్ని వార్తలు