లండన్ చేరుకున్న పవన్ కళ్యాణ్

9 Jul, 2016 19:12 IST|Sakshi
లండన్ చేరుకున్న పవన్ కళ్యాణ్

లండన్: సాధారణంగా సినీ వేడుకల్లో కూడా పెద్దగా కనిపించని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సినిమాకు సంబంధం లేని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు లండన్ చేరుకున్నారు. శనివారం జరగనున్న యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు సంఘం (యుక్తా) ఆరో వార్షికోత్సవాలలో ముఖ్యఅతిథిగా  పాల్గొననున్నారు. ఈస్ట్ లండన్లోని టాక్సీ థియేటర్లో అక్కడి తెలుగు వారు ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.

సుమారు 2000లకు పైగా తెలుగు కుటుంబాలకు ఈ వేడుకలకు హాజరవుతారని భావిస్తున్నారు. ఈ వేడుకలకు హాజరవ్వడానకి లండన్ చేరుకున్న ఆయనకు ఎయిర్ పోర్టులో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. యుక్తా ఆరో వార్షికోత్సవాలలో పవన్ పలువురు కళాకారులను సత్కరించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ కార్యక్రమంలో పవన్ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
 

మరిన్ని వార్తలు