రేపటి నుంచే ఆటా రజతోత్సవాలు

30 Jun, 2016 21:58 IST|Sakshi
రేపటి నుంచే ఆటా రజతోత్సవాలు

చికాగో: అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఏర్పడి 25 సంవత్సరాలు గడచిన సందర్భంగా.. మూడు రోజుల పాటు రజతోత్సవాలు ఘనంగా జరుపుకోవడానికి ఆటా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపటి(శుక్రవారం) నుంచి మూడు రోజుల పాటు అమెరికాలో చికాగోలోని రోజ్‌మెంట్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు.  

ఆటాలో ముఖ్యసభ్యులు కొందరు అరోరాలోని తమరిండ్ రెస్టారెంట్‌లో సమావేశమై రజతోత్సవ ఏర్పాట్లకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మూడు రోజులపాటూ ఘనంగా నిర్వహించనున్న ఈ వేడుకలకు హాజరయ్యే వారి కోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆటా అధ్యక్షుడు సుధాకర్‌.ఆర్‌.పెర్కారి తెలిపారు.

అమెరికాలో నివాసముంటున్న తెలుగు వారి సంక్షేమం కోసం 25 సంవత్సరాల క్రితం ఆటా ఏర్పడింది. అప్పటి నుంచి తెలుగు రాష్ర్టాలతో పాటూ అమెరికాలో పలు సేవా కార్యక్రమాలను ఆటా నిర్వహిస్తోంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఆటా రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కన్వెన్షన్ కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, భాషా పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న ఆటా వేడుకలకు తెలుగువారు భారీ ఎత్తున హాజరై భావితరాలవారికి వారధులుగా నిలవాలని కాన్ఫరెన్స్ డైరెక్టర్ కేకే రెడ్డి తెలిపారు.

రజతోత్సవ వేడుకలు భావోద్వేగంతో కూడుకున్నవని నిబద్ధతతో విజయవంతం చేయడానికి తమవంతు కృషిచేస్తున్నామని ఆటా ట్రస్టీ హనుమంత్‌ రెడ్డి తెలిపారు. ఎంతో ఘణమైన చరిత్ర ఉన్న ఆటా ఉత్సవాలు తొలిసారి చికాగోలో 1991లో ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు.

కాన్ఫరెన్స్ కో కన్వీనర్ కృష్ట ముశ్యమ్, కన్వెన్షన్ మీడియా అధికార ప్రతినిధి కీర్తి కుమార్ రావూరిలు మాట్లాడుతూ మూడు రోజులపాటూ జరిగే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నట్టు తెలిపారు.
ఇఫ్తీకర్ షరీఫ్, హరీష్ కొలసాని, భాను స్వర్గమ్లు ఆటా కార్యక్రమాల గురించి వివరించారు.

ఈ సమావేశంలో కరుణాకర్ అసిరెడ్డి, మధు బొమ్మినేని, అనిల్  బోడిరెడ్డి, కమల చిమట, జగన్ బుక్కరాజు, డా. మెహర్ మేడవరం, వెంకట్ తుడి, రమణ అబ్బరాజు, మోహన్ మన్నె, శర్మ కంకపాక, హరీశ్ కొలసాని, ఉమా కట్‌కి, పార్త పంతం, సుజాత అప్పలనేని, దినకర్ కరుమురి, రమేశ్ గారపాటి, మల్లారెడ్డి, విక్రం రెడ్డి, శ్రీనివాస్ పెదమల్లు, కరుణాకర్ రెడ్డి దొడ్డం, రామరాజు, చలమారెడ్డి బండారు, మహేందర్ ముస్కుల, రమేశ్ పూల, సాయి ప్రియారెడ్డి, ఉషా ప్రీతి, బింది గంగటి, అమర్ నీతం, యెడవల్లి మూర్తి, చాందినీ దువ్వూరి, వీజే రెడ్డి, సునితా రెడ్డి, రాధా కృష్ణా రెడ్డి, సుధీర్ వేల్పుల, రత్నాకర్ కరుమరి, రోహిణి బొక్క, రవి తొక్కల, గోవింద్‌లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు