టెక్సాస్లో హనుమాన్ మందరం

25 Jul, 2015 12:57 IST|Sakshi
టెక్సాస్లో హనుమాన్ మందరం

టెక్సాస్(యూఎస్ఏ):మైసూర్ అవధూత దత్తపీఠాధిపతి, పరమపూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా టెక్సాస్లోని ఫ్రిస్కో ప్రాంతంలో కార్యసిధ్ధి హనుమాన్ మందిర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో యూఎస్ఏలోని వివిధ ప్రాంతాలనుంచి పెద్ద ఎత్తున భక్తులు  పాల్గొన్నారు. అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో సువిశాల ప్రాంతంలో ఈ మందిరాన్ని నిర్మించారు.

ఈ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలు జూలై 18నుంచి జూలై 23 వరకు ఆరు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఇక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఆగష్టు 30 వరకు మొత్తం 40 రోజుల పాటూ కొనసాగనున్నాయి. గర్భగుడిలో ఆకు పచ్చ రంగుతో ఉండే హనుమంతుడి విగ్రహం ఎంతో అందంగా మరెక్కడా లేని విధంగా రూపొందించారు. గర్భగుడికి నాలుగు వైపులా మరో నాలుగు దేవాలయాలను నిర్మించారు.


దేవాలయానికి వచ్చే భక్తుల కోసం.., ప్రార్ధనా మందిరం, ఉచిత వైద్య శిబిరాలు, ఆదివారం పాటశాలలు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక ప్రదేశం, పుస్తకాల ప్రదర్శన శాలలు, కమ్యూనిటీ సేవల కోసం ఖాళీ ప్రదేశం ఇంకా మరెన్నో ప్రత్యేకతలతో ఈ మందిరాన్ని నిర్మించారు.


ఎన్నో దేశాల్లో భారీ ఆంజనేయ, కుమార స్వామి (సుబ్రమణ్యస్వామి) విగ్రహాలను స్థాపించి హిందుమత పటిష్టానికి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఎంతగానో కృషి చేశారు. ధర్మం, భక్తి, భజన, కీర్తన వంటి సంప్రదాయాలు స్వామీజీ బోధించే మార్గాలలో ప్రధానమైనవి. సంగీతం ద్వారా రోగాలను నయం చేయవచ్చునని స్వామీజీ బోధిస్తారు.


Read latest Diaspora News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా